పెద్దమనుషుల ఒప్పందం | pedda manushula oppamdham in telugu story | telangana full story in telugu

                    

               పెద్దమనుషుల ఒప్పందం

ఈ ఒప్పందం ఢిల్లీలో హైదర్ భవన్లో జరిగింది. ఈ ఒప్పందం దేభార్ మరియు జీబీ.పంత్ మధ్య జరిగింది. 

అయితే ఈ ఒప్పందంలో ఎనిమిది మంది ప్రధాన నాయకులు పాల్గొన్నారు. వీరిలో నలుగురు తెలంగాణ వారు మరియు నలుగురు ఆంధ్రాకు చెందిన వారు. 

ఆంధ్రా కు చెందిన వారు బెజవాడ గోపాలరెడ్డి,, సర్దార్ గౌతు లచ్చన్న, సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు. 

తెలంగాణకు చెందిన వారు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, రంగారెడ్డి, నర్సింగరావు. 

అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకం చేసిన వారు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అలాగే ఈ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రానికి 14 పరిరక్షణ లు కల్పించబడ్డాయి. 


1) మిగులు ఆదాయం

తెలంగాణ ప్రాంతం యొక్క మిగులు ఆదాయం దామాషా పద్ధతిలో తెలంగాణకే ఖర్చు పెట్టాలి. దానిని ఎట్టి పరిస్థితిలో ఆంధ్ర అభివృద్ధికి ఖర్చు పెట్టకూడదు. 


2) మద్యపానం

మద్యపాన నిషేధాన్ని కేవలం తెలంగాణ ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ ప్రాంతంలో మద్యపాన నిషేధం అమలు చేయాలి. 


3) విద్య

తెలంగాణలోని విద్యా సంస్థలలో కేవలం తెలంగాణ విద్యార్థులకే సీట్లను కేటాయించాలి. లేదా ఆంధ్రా లోని విద్యా సంస్థలలో 1/3 తెలంగాణ విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. 


4) ఉద్యోగులు తొలగింపు

తెలంగాణలోని ఉద్యోగుల తొలగింపు విషయంలో ఒకవేళ వారిని తొలగించాల్సి వస్తే 40:60 నిష్పత్తిలో తొలగించాలి. 


5) ఉద్యోగ నియామకం

తెలంగాణలోని ఉద్యోగాలను కేవలం 40:60 లో మాత్రమే నియామకాలు జరపాలి. 


6) ఉర్దూ

తెలంగాణలో మొదటి ఐదు సంవత్సరాల వరకు ఉర్దూ భాష అధికార భాషగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలి. 


7) స్థానికత

తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఉద్యోగాలను పొందేందుకు స్థానికుడుగా పరిగణింపబడే౦దుకు తెలంగాణ ప్రాంతంలో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నట్లు రెసిడెన్సీ ఉండాలి. 


8) తెలంగాణ రీజనల్ కౌన్సిల్

తెలంగాణలోని వ్యవసాయ భూములు కొనాలన్నా లేదా అక్కడ వ్యవసాయ భూములు అమ్మాలన్నా అవి టి ఆర్ సి యొక్క నియంత్రణలో ఉంటాయి. 


9) తెలంగాణ రీజనల్ కౌన్సిల్ తెలంగాణ యొక్క సర్వతోముఖాభివృద్ధి ని ప్రోత్సహించేందుకు ఏర్పడింది. 


10) తెలంగాణ రీజినల్ కౌన్సిల్లో 20 మంది సభ్యులు ఉంటారు. వారిలో తొమ్మిది మంది జిల్లాల నుండి కొందరు, రాజకీయాలనుండి ఆరుగురు, ఐదుగురు మేధావులు ఉంటారు. 


11) అయితే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఉద్యోగ నియామకాలను, నీటి పారుదల ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆదేశాలను జారీ చేస్తుంది. 


12) మంత్రిమండలి

ప్రజలకు రిజర్వేషన్ కల్పించేందుకు 40:60 నిష్పత్తిలో మాత్రమే మంత్రిమండలి నియమించాలి. అలాగే వీరిలో ఒక ముస్లిం మంత్రి ఉండాలి , అయితే ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు అయి ఉండాలి. 


13) ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి 

ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లో కచ్చితంగా తెలంగాణ వారు ఒకరు ఉండాలి. అదేవిధంగా ఐదు శాఖలలో రెండు శాఖలలో కచ్చితంగా తెలంగాణకు చెందిన ప్రజలు ఉండాలి. 


14) హైదరాబాద్ పిసిసి

హైదరాబాద్ పి సి సి ని 1962 వరకు కొనసాగించాలి. అయితే దీనిని 1958లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేశారు. 


ఈ విధంగా ఈ 14 పరిరక్షణల వలన విశాలాంధ్ర ఏర్పాటుకు తెలంగాణ వారు సహకరించారు. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తెలుగు రాష్ట్రం యొక్క పేరుని విశాలాంధ్ర కి బదులుగా" ఆంధ్ర తెలంగాణ" అనే పేరు పెట్టాలని అనుకున్నారు. 

కానీ ఈ పేరుకు బదులుగా ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెడితే బాగుంటుందని నిర్ణయించుకుని. ఈ మూడు తెలుగు ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టారు. 


ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని- ముఖ్యమంత్రుల వరుసక్రమం


1) సుబ్బా రాయలు రెడ్డియార్ (1930-21) 

2) రాజా రమణీయం(1921-1926) 

3) పి.సుబ్బరాయన్(1926-30) 

4) మునిస్వామి నాయుడు(1930-32) 

5) బొబ్బిలి రాజా(1932-36) 

6) పి. టి రాజన్(1936) 

7) రామకృష్ణ రంగారావు(1936-37) 

8) కె.వి.రెడ్డి నాయుడు(1937) 

9) రాజగోపాలాచారి(1937-1939) 

10) టంగుటూరి ప్రకాశం(1946-47) 

11) రామస్వామి రెడ్డియార్(1947-49) 

12) కుమారస్వామి(1949-1952) 

13) రాజగోపాలాచారి(1952-54) 


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు

1) టంగుటూరి ప్రకాశం(1953-54) 

**రాష్ట్రపతి పాలన(1954-55) 

2) బెజవాడ గోపాలరెడ్డి(1955-56) 


హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు

1) జె.యన్ చౌదరి(1948-49) 

2) ఎం.కె వెల్లోడి(1950-52) 

3) బూర్గుల రామకృష్ణ(1952-56) 


ఈ విధంగా విశాలాంధ్ర ఏర్పడక ముందు ముఖ్యమంత్రులుగా పై వారందరూ పని చేశారు. ఆ తరువాత కొన్ని ఒప్పందాల కారణంగా ఉదాహరణకు ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన ఒప్పందం పెద్దమనుషుల ఒప్పందం ఈ ఒప్పందం ఈ కారణంగానే కోస్తా, తెలంగాణ, రాయలసీమ లు కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్ని పరిరక్షణలో సరిగ్గా చేయలేకపోయారు అందువలన కొన్ని సంవత్సరాల తరువాత మళ్లీ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఆంధ్రలో వేరు చేయబడ్డాయి. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు