శాతవాహనుల చరిత్ర
1) శ్రీముఖుడు
2) కృష్ణ
3) శాతకర్ణి-1
4) వేదశ్రీ
5) శాతకర్ణి-2
6)కుంతల శాతకర్ణి
7) పులోమావి-1
8) హాలుడు
9)గౌతమీ పుత్ర శాతకర్ణి
10)వశిష్ట పుత్ర పులోమావి/ పులోమావి-2
11)వశిష్ట పుత్ర శివ శ్రీ
12)యజ్ఞశ్రీ
14)విజయశ్రీ
15)చంద్రశ్రీ
16)పులోమావి-3
శ్రీముఖుడు
ఇతనికి రాయ అనే బిరుదు కలదు. ఈ బిరుదును మొగల్ చక్రవర్తి అయిన అశోకుడు ఇచ్చాడు. అలాగే రాయసిముఖ శాతవాహన అనే బిరుదు కూడా ఉందని కోటిలింగాలలో దొరికిన నాణెముల ద్వారా తెలుస్తుంది.
ఈయన కాలానికి చెందిన నాణెములు కోటిలింగాల వద్ద దొరికాయి.
ఈయన గోదావరి సమీపంలో కోటిలింగాల వద్ద రాయపట్నం అనే పట్టణాన్ని నిర్మించాడు.
ఈ యొక్క గురువు కాలకచూరి ఈయన జైన మత గురువు.
శ్రీముఖిుడి యొక్క రాజధాని కోటిలింగాలలో కలదు, రెండవ రాజధాని ప్రతిష్టానపురం లో ఉండేది.
ఈయన మహారాష్ట్రలో నాగ జాతికి చెందిన త్రైనకైరో అనే రాజును ఓడించి, అతని కుమార్తె అయిన నాగానికకు శాతకర్ణి-1 కు ఇచ్చి వివాహం జరిపించాడు.
శాతకర్ణి-1 శ్రీముఖి యొక్క కొడుకు. అయితే శ్రీముఖుడు ఫస్టు జైన మతాన్ని తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు.
కృష్ణ
ఈయన నాసిక్, కన్హరీ గుహలను నిర్మించాడు. అలాగే నాసిక్లో బౌద్ధ సన్యాసుల పరిరక్షణ కొరకు ధర్మ మహామాథ్య అనే పేరుతో వాడిని పరిరక్షించేందుకు కొంతమంది వ్యక్తులను నియమించాడు.
అలాగే దక్షిణ భారతదేశంలో భాగవత మతం ప్రవేశపెట్టాడు, ఈ మతం కర్మ మార్గాన్ని సూచిస్తుంది. ఈ భాగవత మతం అనేది పుష్యమిత్ర కాలంలో ఇండియా లోకి వచ్చింది. అప్పటినుండి వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.
శాతకర్ణి-1
ఈయన యొక్క బిరుదులు అప్రతిహారచక్ర, ఏకవీర, సుూర, దక్షిణ ప్రజాపతి, సామ్రాట్, అశ్వకాదిీశ అనే బిరుదులు కలవు.
ఈయన యొక్క నాణెములు ఉజ్జయిని పట్టణంలో దొరికాయి, ఈ నాణెములు గజ గుర్తుతో ఉండేవి.
ఈయన నానాఘాట్ శాసనం వేయించాడు, ఈ శాసనం ఆధారంగా నాగానిక ఇతని భార్య అని తెలుస్తుంది.
ఈయన మొట్టమొదట శాతవాహన వంశ నామము ప్రవేశపెట్టాడు, అదేవిధంగా సర్వ స్వతంత్ర పాలనను ప్రారంభించాడు.
వెండి నాణెములను ముద్రించిన మొదటి శాతవాహన రాజు ఈయనే, అలాగే మొదటగా వైదిక యజ్ఞయాగాదులను నిర్వహించి అనేక ప్రత్యేకతలు పొందాడు. రాజశయోగం ఒకసారి, అశ్వమేధ యాగం రెండుసార్లు నిర్వహించాడు.
అలాగే బ్రాహ్మణులకు మొదటగా పన్ను మినహాయింపు తీసివేసి భూములను పంచిపెట్టాడు.
ఈయన ప్రముఖ పాలకులు అయిన ఖారవేలుడు, పుష్యమిత్ర సుంగ, డెమిట్రియస్ లను ఓడించాడు.
ఈయన శ೨౦గులను ఓడించి ఉజ్జయినీ నగరాన్ని ఆక్రమిస్తాడు.
ఖారవేలుడు వేయించిన గుంటుపల్లి శాసనం ప్రకారం ఇతనిని మూషిక అధిపతిగా పేర్కొనటం జరిగింది.
వేదశ్రీ
వేదశ్రీ యొక్క బిరుదు పుర్నోతుంగ. ఖారవేలుడు ఇతని కాలంలో భట్టిప్రోలు పై దాడి చేసి ఈ నగరాన్ని ధ్వంసం చేస్తాడు.
ఇతను నాగానిక మరియు శాతకర్ణి-1 యొక్క కుమారుడు.
ఈయన యొక్క తల్లి నాగానిక ఈయన రాజ్యంలో సంరక్షకురాలు గా ఉండేది. కూడా శాతవాహనుల రాజులలో ప్రముఖ ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాజు.
శాతకర్ణి-2
ఈయన సా౦చి స్థూప దక్షిణ తోరణ శాసనం వేయించాడు, అలాగే బిల్సా శాసనం కూడా వేయించాడు.
యుగ పురాణం ప్రకారం పాటలీపుత్ర౦ను కొంతకాలం పరిపాలించాడు. ఉత్తర ఇండియాను పరిపాలించిన మొదటి దక్షిణదేశ రాజు. అలాగే ఇతను విదీష అనే ప్రాంతంలో కూడా ఆక్రమించాడు.
ఇతని యొక్క పరిపాలన కాలం ఇంచుమించుగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కూడా శాతవాహనుల రాజులలో పేరుపొందిన రాజు.
కుంతల శాతకర్ణి
ఇతనికి విక్రమార్క, విక్రమాదిత్య అనే బిరుదులు ఉండేవి. ఈయన కాకా౦త్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం ను రచించాడు.
ఇతని కాలంలో సంస్కృత భాష రాజభాషగా ప్రకటించబడింది, అలాగే ఈయన రాజ్యంలో సంస్కృత భాష ఎక్కువగా ఉపయోగించేవారు.
ఈయన భార్యలలో ఒకరు అయిన మలయావతి మాయావతి కరిర్త అనే రకామ క్రీడ వలన మరణించింది.
పులోమావి-1
ఈయన వాయు పురాణం ప్రకారం మగధ దేశంలోని రాజు అయిన సుశర్మను ఓడించి పాటలీపుత్రమును ఆక్రమించుకున్నాడు.
సుశర్మ యొక్క వంశం కన్వ వంశం.
పులోమావి-1 పాటలీపుత్రమును ఆక్రమించుకున్న తరువాత ఈ రాజ్యము 10 సంవత్సరాల పాటు నిరాడంబరంగా పరిపాలించాడు.
ఇతనికి సంబంధించిన నాణెములు పాటలీపుత్రం లోని కుహురమ అనే ప్రాంతంలో దొరికాయి.
హాలుడు
ఇతని యొక్క బిరుదు కవివస్తల.
ఇతను ప్రాకృతభాషలో రాసిన గ్రంథం గాధాసప్తశతి, అయితే ఈ గ్రంథము శ్రీ పాలుడు మరియు హాలుడు కలిసి రాశారు, అధిక భాగం శ్రీపాలుడు రాశాడు.
ఇతని యొక్క సేనాపతి విజయనాధుడు.
హాలుని యొక్క పరిపాలనా కాలాన్ని ప్రాకృత స్వర్ణయుగం అంటారు, ఎందుకంటే ఈయన కాలంలో ప్రాకృత భాష చాలా అభివృద్ధి చెందింది. అలాగే ప్రాకృతం ని ఎక్కువగా ఉపయోగించేవారు.
గౌతమీపుత్ర శాతకర్ణి
ఇతని యొక్క బిరుదులు క్షత్రియ ధర్పమాన మర్దన, ఏక బ్రాహ్మణ, ఏక సూర, ఆగమ నిలయ, రాజులకే రాజు, వర్ణ సాంకర్య నిరోధక.
ఈయన శత రాజు సహపానుని పిండి నాణేలను శాతవాహన చిహ్నాలతో పునఃముద్రణ చేశాడు.
ఇతని యొక్క నిర్మాణాలు భద్రయ్యానకొండ, లూనార్హ కొండలను తొలగించాడు, అయితే ఈ నిర్మాణాలకు అయ్యే ఖర్చును తన తల్లి అయినా గౌతమీ బాలశ్రీ ధనము దానం చేసింది.
ఇతని యొక్క సేనాపతి శివపుత్రుడు.
ఈయన తల్లి పేరును రాజుల యొక్క పేర్లకు ముందు జోడించు కునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే ఇతను బౌద్ధులకు 100 నివర్తనల భూమిని దానంగా ఇచ్చాడు.
ఇతను నాసిక్ దగ్గర జోగల్ తంబి యుద్ధం చేశాడు. అలాగే శత రాజు సహపానుని ఓడించి వెండి నాణెములను సేకరించి పునః ముద్రణ చేశాడు. అలాగే బ్రోచ్ ఓడరేవును ఆక్రమించుకున్నాడు.
పులోమావి-2
ఈయన యొక్క బిరుదులు నవ నగర స్వామి, దక్షిణ పదేశ్వరుడు.
ఈయన యొక్క శాసనాలు అమరావతి శాసనం, కార్లే శాసనం, నాసిక్ లో నాలుగు శాసనాలు.
అమరావతి శాసనం అనేది శాతవాహనుల తొలి శాసనం దీనిలోనే నాగబాబు అనే పదం ఉంది.
ఈయన అమరావతి స్థూపంను నిర్మించాడు.
వశిష్ట పుత్ర పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు.
ఈయన రుద్ర ధామ నుడి చేతిలో ఓటమికి గురై రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధరణి కోట కు మార్చాడు.
వశిష్ట పుత్ర శివ శాతకర్ణి:-
ఈయనను దక్షిణ పద పది అని పిలిచేవారు. రుద్ర ధామం కుమార్తె అయిన రుద్ర ధామికను వివాహం చేసుకున్నాడు.
ఇతను ద్విభాషా నానెములను వేయించాడు. ఈ నాణేలు ప్రాకృతం మరియు దేశి భాషలో ఉండేవి.
యజ్ఞశ్రీ
ఈయనకు యజ్ఞాలు బాగా చేయటం వలన యజ్ఞశ్రీ అనే పేరు వచ్చింది. ఈయన బిరుదు త్రీసమురాధిపతి.
అతని యొక్క సేనాధిపతి విజయగోపుడు. అలాగే ఈయన ఓడతెర చేప చిహ్నంతో గల నాణేలను ముద్రించాడు. ఈ నాణాలు ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో అలాగే చిన్నగంజాం లో ఎక్కువగా దొరికాయి.
ఈయన చినగంజాం శాసనము వేయించాడు. మత్స్య పురాణ సంకలన ఇతని కాలంలో ప్రారంభం అయ్యింది.
విజయశ్రీ
ఇతను నాగార్జునకొండ శాసనంను వేయించాడు. అలాగే నాగార్జున కొండ వద్ద విజయపురి అనే పట్టణము నిర్మించాడు.
చంద్రశ్రీ
ఇతను తూర్పుగోదావరి లో కొడవలి శాసనం వేయించాడు.
ఈయనపై సామంతులు సేనాపతులు తిరుగుబాటు చేసి ఇతనిని ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
పులోమావి-3
ఈయన శాతవాహనులలో చివరి పాలకుడు. ఇతన్ని అన్యస్తేషాయనం అంటారు. ఇతను మాకధోని శాసనం వేయించాడు, ఈ శాసనం పై అక్షరములు లిఖించిన వాడు కంద నాధుడు.
అతని యొక్క సేనాపతి శ్రీ శాంతనుడు పై తిరుగుబాటు చేసి పులోమావిని తరిమికొట్టి విజయపురి రాజధానిగా ఇక్ష్వాకులు రాజ్యస్థాపన చేశారు. అప్పుడు మూడవ పులోమావి కంద నాథుడు కలిసి బళ్లారికి పారిపోయి అక్కడ నుండి కొంతకాలం పరిపాలించాడు. ఆ సమయంలోనే బళ్లారిలో మాకధోని శాసనం ను వేయించాడు.
మూడవ పులోమావి మరణం తరువాత శాతవాహన రాజ్యం పతనం అయింది ఆ తరువాత వేరు వేరు రాజవంశాల వారు వీరి రాజ్యాన్ని పరిపాలించసాగారు.
0 కామెంట్‌లు