ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
ఆంధ్ర రాయలసీమ తెలంగాణ మూడు తెలుగు ప్రాంతాలు కలిసి తెలుగు రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే కోరిక 1910వ సంవత్సరం నుండే ఉంది
అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి చాలామంది నాయకులు మరియు ప్రజలు కృషి చేశారు.
ఈ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడటానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది.
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ- ప్రముఖ నాయకులు
కాశీనాధుని నాగేశ్వరరావు:-
ఇతను 1908 వ సంవత్సరంలో బొంబాయిలో ఒక వారపత్రికను స్థాపించాడు దాని పేరే“ ఆంధ్ర పత్రిక”. అయితే ఈ పత్రికను1914సంవత్సరం లో దినపత్రికగా మార్చి , దీని యొక్క ఆఫీసు మద్రాస్ కు మార్చాడు.
అదేవిధంగా కాశీనాధుని నాగేశ్వరరావు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు కలిసి ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకుంటూ ఉగాది సంచిక అనే పేరుతో వ్యాసాలు రచించేవాడు. అలాగే ప్రతి ఉగాది రోజున తెలుగు ప్రాంతాలు అన్ని కలవాలని కోరుకుంటూ వాడు.
ఈయన రాసిన వ్యాసాలు ఆంధ్ర మహా జనులకు విన్నపం, ఆంధ్రుల అభ్యుదయం, భాషా రాష్ట్రాల స్వయం పాలన, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, మహాంధ్ర సాక్షాత్కారం.
జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ:-
మద్రాస్ నుంచి తెలుగువారిని వేరు చేస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన మొదటి అగ్రనాయకులు. అదేవిధంగా వీరు ఆంధ్ర పటం ను రూపొందించారు, ఆంధ్ర రాయలసీమ తెలంగాణ, లను కలిపి ఈపటాన్ని రూపొందించారు.
న్యాపతి సుబ్బారావు:-
1914 లో విజయవాడ లో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ఆ సమయంలో ఇతను ఈ విధంగా పేర్కొన్నాడు. ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితేనే సంపూర్ణ తెలుగు రాష్ట్రం ఏర్పడినట్లు అని తెలిపాడు.
అదేవిధంగా ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్ధరణ కొరకు చాలా కృషి చేశాడు.
జీ.వి సుబ్బారావు:-
ఇతను ఆంధ్ర స్వరాజ్య పార్టీ నాయకుడు.1936 వ సంవత్సరంలో ఉగాది రోజున ఒక ప్రత్యేక వ్యాస సంచికను ప్రచురించాడు. అయితే ఈ వ్యాసాన్ని గోష్టి ఈ పత్రికలో ప్రచురించాడు.
తన యొక్క ఆంధ్ర స్వరాజ్య పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్రంలో నా పార్టీని గెలిపిస్తే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కలుపుతూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడుటకు కృషి చేశాడు.
మామిడిపూడి వెంకట రంగయ్య:-
ఈయన ఆంధ్ర యూనివర్సిటీ యొక్క హిస్టరీ సబ్జెక్టు యొక్క విభాగానికి పెద్దగా వ్యవహరించేవాడు.1937 వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క వార్షిక ఉత్సవాలు నిర్వహించబడ్డాయి, ఆ సందర్భంలో ఆయన హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ లతో కూడిన విశాలాంధ్ర ఏర్పడాలని తీర్మానం చేశాడు.
పాండ్రంగి కేశవరావు:-
ఇతను ఆంధ్ర జాతీయ పతాకాన్ని1938 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కృషి చేశాడు.
సర్ విజయానంద:-
విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రమహాసభకు1942 లో విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను ఒక క్రికెటర్
వావిలాల గోపాలకృష్ణయ్య:-
ఇతను సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పని చేసేవాడు, అలాగే ఇతను విశాలాంధ్ర అనే పుస్తకమును రచించాడు. ఈ గ్రంథం ఆంధ్ర ప్రదేశ్ అవతరణ కొంతవరకూ తోడ్పడింది.
పుచ్చలపల్లి సుందరయ్య:-
ఆంధ్రాలో కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేసిన వ్యక్తి ఈయన.1945 వా సంవత్సరంలో విశాలాంధ్ర ఉద్యమం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాడు. అదేవిధంగా ప్రత్యేక విశాలాంధ్రను కోరుతూ ఇతను రాసిన గ్రంథం విశాలాంధ్రలో ప్రజారాజ్యం. ఈయన 1952 లో ప్రచురించిన పత్రిక “విశాలాంధ్ర పత్రిక”.
విశాలాంధ్ర మహాసభలు:-
విజయవాడ లో జరిగిన విశాలాంధ్ర మహాసభకు అయ్యదేవర కాళేశ్వరరావు 1949 లో అధ్యక్షత వహించాడు. అదేవిధంగా 1950 తేదీలలో మహాసభ యొక్క బహిరంగ సభ వరంగల్ లో హయగ్రీవాచారి అధ్యక్షతన జరిగింది, ఈ సభకు తెలంగాణ తరఫున కోదాటి రామలింగం మరియు మూర్తి హాజరయ్యారు, అదేవిధంగా ఆంధ్ర తరపున టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యాడు.
హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని ఇక్కడ డిమాండ్ చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కె వి రంగా పేర్కొన్నాడు ఇతను గుంటూరు వాసి.
విశాలాంధ్ర మహాసభ యొక్క తొలి వార్షికోత్సవ సభ హైదరాబాదులో జరిగింది. అదేవిధంగా విశాలాంధ్ర చివరి సభ హైదరాబాదులో1954 లో శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది.
ఆంధ్ర పి సి సి కమిటీ:-
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ముందు రోజు ఆంధ్రా పి.సి.సి నీలం సంజీవ రెడ్డి నేతృత్వంలో కర్నూల్ లో సమావేశం జరిగింది.
ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయుటకు అదేవిధంగా ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇష్టాన్ని ఒప్పించుట కు నీలం నేతృత్వంలో ఆంధ్ర పిసిసి ఏర్పడింది.
1953 సంవత్సరంలో నెహ్రూ విశాలాంధ్ర ఏర్పాటుపై ఈ విధంగా అన్నాడు విశాలాంధ్ర వెనుక సామ్రాజ్యవాదం దాగి ఉందని పేర్కొన్నాడు.
అనంతశయనం అయ్యంగార్:-
ఈయన విశాలాంధ్ర ఏర్పాటుపై ఈ విధంగా పేర్కొన్నాడు“ఆంధ్ర రథం ప్రారంభం అయ్యింది ఇది హైదరాబాద్ కు వెళ్లి ఆగుతుందని, ఇప్పుడు మార్గమధ్యంలో కర్నూలులో విశ్రాంతి తీసుకుంటుందని పేర్కొన్నాడు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు- భాషా రాష్ట్రాల డిమాండ్:-
1953 అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుండి వేరుచేయబడి సరికొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ సమయంలో దేశంలో చాలా ప్రాంతాలలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను డిమాండ్ చేశారు. ఎస్ ఆర్ సి కమీషన్ను 1953 డిసెంబర్ 22న నెహ్రూ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు, దీన్ని డిసెంబర్ 29 న ఫజల్ అలీ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశాడు.ఈ కమిటీ భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడొచ్చు లేదా అన్న విషయాలను తెలుపుతుంది.
అయితే ఈ ఫజల్ అలీ కమిషన్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, ప్రజలను ఉత్తరాలు పంపమని తెలిపింది. అయితే ప్రజలు ఒక లక్ష యాభై రెండు వేల ఉత్తరాలను పంపారు, అందులో నుంచి ఈ కమిషన్ రెండువేల ఉత్తరాలను తీసుకుని భాషా రాష్ట్రాల ఏర్పాటుకు సూచనలు తీసుకుంది.
అయితే ఈ ఫజల్ అలీ కమిటీ తన నివేదికను 1955 సెప్టెంబర్ 30వ తేదీన సమర్పించింది, అయితే ఈ నివేదిక 1955 అక్టోబర్ 10వ తేదీన బయటకు తెలిసింది.
అయితే ఫజల్ అలీ కమిషన్ నివేదిక లోని ప్రధాన అంశాలు ఇండియాలో ఉండే ఏబిసిడి రాష్ట్రాలను రద్దు చేసి కేవలం సాధారణ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది, అదేవిధంగా ఫజల్ అలీ విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి తెలుసుకుంది.
విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని పేర్కొన్న ప్రముఖులు అయ్యదేవర కాళేశ్వరరావు, స్వామి రామానంద తీర్థ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మీర్ మహబూబ్ అలీ ఖాన్.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని పేర్కొన్న ప్రముఖులు కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె వి నరసింహారావు, ఎండి అలీ, అరిగే రామస్వామి.
ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కృషి చేశారు.
0 కామెంట్‌లు