ఆంధ్ర జాతి చరిత్ర
జాతి:- ఒక ప్రదేశంలో దీర్ఘకాలంపాటు నివాసం ఉండే జన సమూహాన్ని జాతి అంటారు
ఆంధ్రాలో విభిన్న జాతులు ఉన్నాయి.
మహాభారతం ఆంధ్రుల గురించి ఈ క్రింది విధంగా పేర్కొంది
( ఆంధ్ర శ్యాం బహువ) అనగా ఆంధ్రజాతి లో వివిధ జాతులు ఉన్నాయి. ఆంధ్ర జాతి లో ఉన్న వివిధ జాతులు
ద్రవిడులు:-
ద్రావిడ అనే పదం దిగంత అనే పదం నుండి వచ్చింది. రుగ్వేదంలో దిగతా అనే పదం గురించి పేర్కొనబడింది దీని అర్థం తరిమి వేయబడ్డ ప్రజలు అని. ఆర్యుల దండయాత్ర కారణంగా సింధూ నాగరికత ప్రజలు కొందరు దక్షిణం వైపుకు వచ్చారు. వీరే ద్రవిడులు గా ప్రసిద్ధి చెందారు
ఆర్య ఆంధ్రులు:- వాయు పురాణం ప్రకారం 16 ఆర్య తెగలలో ఒక తెగ అయిన ఆర్య ఆంధ్రులు ఆక్స్ రివర్ లేదా వసూ నది తీరంలో అందకయి అనే ప్రాంతంలో నివసించేవారు. ఆర్యుల దండయాత్ర కారణంగా వీరు అందకయి ప్రాంతం నుండి ఆఫ్ఘనిస్తాన్ లోకి వచ్చి స్థిరపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో వీరిని అంద్రీలు అని పిలిచేవారు. ఆర్యులు వీరిపై పెద్దగా దాడి చేయటం వలన వీరు యమునా నది వింధ్య పర్వతాల మధ్య ఉన్న కరూర్ఆ దేశంలో స్థిర పడ్డారు. చందోద్య నిషిత్ ప్రకారం మిడతల దాడి కారణంగా వీరు ఆ దేశాన్ని వదిలి వింధ్య పర్వతాలను దాటుకుని ఆంధ్రాలో స్థిర పడ్డారు
నాగులు:-
నాగులు గంగ యమునా నదుల మధ్య ఉండేవారు. ఆర్యుల దండయాత్ర కారణంగా వీరు దక్షిణ భారత దేశం లోకి వచ్చారు. కృష్ణా నది తీరంలో ఉన్న వజ్రాల దీవి వద్ద స్థిరపడ్డారు. వీరు బౌద్ధ మతం స్వీకరించారు అలాగే సర్ప కిరీటం కూడా ధరించేవారు. వేప చెట్టును పూజించేవారు ఈ విధంగా ప్రధానంగా రావి చెట్టుని పూజించేవారు. నాగరాజు గౌతమ బుద్ధుడు రుషి నగరంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇతను ఏడు పడగల తో ఎండ తగలకుండా బుద్ధునికి నీడ పట్టాడు. దీని గురించి తెలియజేసే శాసనం నాగార్జునకొండలో దొరికింది. నాగ అశోకుడు అమరావతి స్తూపం నిర్మించాడు.
యక్షులు:-
వీరు టిబెట్ నుండి ఆంధ్రాలో కి ప్రతి పాల పురం భట్టిప్రోలు వచ్చి స్థిర పడ్డారు. యక్షరాజు కుటీర కుడు భట్టిప్రోలు శోభ శాసనాన్ని వేయించాడు. ఇవి దక్షిణ భారత దేశంలో తొలి స్తూపం గా ప్రసిద్ధి చెందింది. ఈ శాసనం లో పట్టణ పరిపాలన గురించి పేర్కొనబడింది. మెగస్తనీస్ గ్రంథంలో ఈ సభల గురించి పేర్కొన్నాడు. ఇప్పుడు ఏపీ లో నివసిస్తున్న జక్కులు యక్ష జాతికి చెందినవారు.
శబరిలు:-
వీరు వింధ్య పర్వత ప్రాంతం నుండి ఏపీ లోకి ప్రవేశించారు. ఏపీలో వీరు ఉత్తర కోస్తా ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరి యొక్క పేరు మీదుగానే శబరి నది యొక్క పేరు వచ్చింది. గంజాం జిల్లాలో ఉండే సవరులు. శబర జాతికి చెందినవారు. ఆధునిక సవర జాతి అభ్యుదయానికి కృషి చేసిన వాడు గిడుగు రామ్మూర్తి పంతులు.
మూతిబా, పుండ్ర, పులింద:-
ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి గ్రంథం ఐతరేయ బ్రాహ్మణం. ఈ గ్రంథంలో సునిశ్యపుని కథ గురించి తెలుపబడింది. విశ్వామిత్రుడు సునిశ్యపుని కాపాడి. తన ఆశ్రమానికి తీసుకుపోయి అతన్ని వాళ్ల సోదరుడిగా అంగీకరించాలని విశ్వామిత్రుడి కుమారులకు చెప్పాడు. కానీ విశ్వామిత్రుని కుమారులు ఆ పిల్లవాణ్ణి తమ సోదరుడిగా అంగీకరించలేదు. దీంతో కోపం తెచ్చుకున్న విశ్వామిత్రుడు తక్షణమే తమ 50 మంది కుమారులను ఆశ్రమాన్ని వదిలి మూతిబా, పుండ్ర, పులింద ప్రజలతో కలిసి జీవించాలని శపించాడు. ఈ 50 మంది కుమారులు ఈ మూడు తెగల ప్రజలతో కలిసి జీవించసాగారు. ఈ విధంగా ఆంధ్రులను విశ్వామిత్రుని యొక్క సంతతిగా పేర్కొంటారు.
మహిషులు, అశ్వ కులు, దరిదులు
వీరు దక్షిణ భారత దేశంలో ఉండే వారు. ఆంధ్ర రాజ్యంలో ఉన్న ఆర్య ఇతరులలో మొదటగా చదవటం రాయటం తెలిసిన ప్రజలు వీరు. వీరిని ఆర్యులు హేళన చేయుట కొరకు పిశాచులు అని పిలిచేవారు. వీరి భాషను పైశాచిక భాష అనేవారు. ఈ విధంగా ఆర్యులు వీరిని హేళన చేసేవారు. గుణాడ్యుడు బృహత్కథ అనే గ్రంథము పైశాచిక భాషలో రచించాడు. పైశాచిక భాషను తెలుగు భాష గా దినేష్ చంద్ర పేర్కొన్నాడు.
ఆంధ్ర దేశానికి గల వివిధ పేర్లు:-
వజ్ర భూమి
బౌద్ధ సాహిత్యం ప్రకారం ఆంధ్రా లోని కృష్ణాతీరంలో కొల్లూరు లో అధికంగా వజ్రాలు దొరికేవి అందువలనే ఈ ప్రాంతాన్ని వజ్రాల భూమి అని పిలిచేవారు. ఈ ప్రాంతంలో చాలా వజ్రాలు దొరికేవి. నాగజాతి వారు అమరావతి ప్రాంతాన్ని కూడా వజ్రాల జి అనే పేరుతో పిలిచేవారు. వీరు నీ పేరు తోనే అమరావతి పాలించారు.
నాగభూమి:-
బౌద్ధ సాహిత్యం ప్రకారం ఆంధ్ర ప్రాంతాన్ని నాగులు పాలించారు. అందువల్లనే ఈ ప్రాంతానికి నాగ భూమి అనే పేరు వచ్చింది. అదేవిధంగా బౌద్ధ సాహిత్యం ప్రకారం శ్రీలంకను నాగ ద్వీపం అని పేర్కొన్నారు. ఈ విధంగా ఆంధ్రదేశానికి నాగ భూమి అని కూడా పిలిచేవారు.
త్రిలింగ దేశం
దీనిని మొదట పేర్కొంది స్కంద పురాణం ఈ సంద పురాణంలో ఆంధ్ర రాష్ట్రాన్ని త్రిలింగ దేశంగా పేర్కొంది. ఎందుకనగా కాలేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం లలో లింగాలు ప్రతిష్టించి ఉన్నాయి ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ఒక రేగి స్తే అది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అందువల్లనే త్రిలింగ దేశం అనే పేరు వచ్చింది.
ఆంధ్రుల ప్రస్తావన:-
బ్రహ్మాండపురాణం:-
దీని ప్రకారం ఆంధ్ర మహావిష్ణు అనే రాజు ఆంధ్ర దేశాన్ని పాలించే వాడు. దీని సరిహద్దులు మహేంద్రగిరి, కాలేశ్వరం, శ్రీశైలం ద్రాక్షారామం. కలుపుతూ భారీ రక్షణ గోడను నిర్మించాడు. అయితే ఇతని రాజధాని కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం లో ఉండేది. శ్రీకాకుళంలో ఇతను ఆంధ్ర మహావిష్ణు దేవాలయం నిర్మించాడు. అయితే ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పురాతనమైన దేవాలయం.
మనుస్మృతి:-
ఈ మనుస్మృతి ప్రకారం ఆంధ్రులు అనేవారు వెలికి తీయబడ్డ ప్రజలు అని పేర్కొంది.
మహాభారతం:-
ఈ మహాభారతం ఆధారంగా ఆంధ్రులను ఆంధ్రచ్ఛబహువ అని పేర్కొనబడింది. అయితే మహాభారతం ఆధారంగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఆంధ్రులు కౌరవులకి సపోర్ట్ చేసి వారికి బలాన్ని చేకూరుస్తాయి. సహదేవుడు దక్షిణ భారతదేశ చేసినప్పుడు అతను ఆక్రమించుకున్న రాజ్యాలలో ఆంధ్ర రాజ్యం కూడా ఒకటి ఉంది అని పేర్కొనబడింది ఈ మహాభారతంలో.
రామాయణం:-
రాముడు సీత జాడ కోసం సుగ్రీవుని సహాయం అడిగాడు ఆ సందర్భంలో సుగ్రీవుడు వానరసేనకు చోళ, పాండ్య, ఆంధ్ర దేశాలలో సీతను వెతకమని తన వానరసేనను ఆదేశించాడు. ఈ సందర్భంలో కూడా ఆంధ్ర ప్రస్థావన అనేది వచ్చింది.
ఋగ్వేదం:-
ఋగ్వేదం ప్రకారం దిగత అంటే ద్రవిడులు అని అర్థం వీరినే తరిమి వేయబడ్డ ప్రజలు అంటారు. ఈ ఋగ్వేదంలోనూ ద్రవిడులను యాగాలు చేయని శూద్రులు అని పేర్కొనడం జరిగింది.వీరిని దాసులు అని కూడా పిలిచేవారు.
సుతని పాతం:-
ఈ సుతని పాతం ఆధారంగా ఆంధ్రులు అనేవారు అందకరత్త అనే ప్రాంతం నుండి వచ్చారు. అందువల్లనే ఆంధ్రులను అందకరతులు అని పిలిచేవారు.
భవవరి:-
ఇతను అస్మక రాజ్యం లో ఒక బ్రాహ్మణుడు. ఈయన బుద్ధుడి గురించి తెలుసుకుని బౌద్ధ సిద్ధాంతాలను తెలుసుకొనుట కొరకు అతని శిష్యులైన కౌసిన్యు,స్నాయను మగధకు పంపాడు. అయితే వీరిద్దరూ బుద్ధుని కలిసి కొంత కాలం అక్కడే ఉండి తరువాత తిరిగి వారి రాజ్యానికి వెళ్లి భవరికి బుద్ధుని సిద్ధాంతాల గురించి వివరించారు. దీనికి ప్రభావితమైన భవరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అలాగే అస్మక రాజ్యం లో బౌద్ధ మతాన్ని కూడా చాలా వ్యాప్తి చేశాడు. కౌటిన్య అనే వ్యక్తి బుద్ధుడి బోధనలు విన్న ఐదుగురిలో ఒకడు ఈయన ఆంధ్రాలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు.
భీమసేన్ జాతక:-
దీనిలో ఆంధ్రుల నివాసం అనేది ఆంధ్రపథ౦ అని పేర్కొనబడింది.
సెరివణజ జాతక:-
ఆంధ్రుల రాజధాని ఆంధ్రనగరి అనేది తేలి వాహనం నది తీరాన ఉంది అని ఈ సెరివణజ జాతక ప్రకారం తెలుపబడింది. అయితే పీసీ రాయ్ తేలివాహన నది అనగా కృష్ణా నది అని పేర్కొన్నాడు.
శివ స్కంద వర్మ వేయించిన మైదవోలు శాసనం ప్రకారం ఆంధ్రుల రాజధాని కృష్ణా నది తీరాన ఉన్న ధాన్యకటకం అని పేర్కొనబడింది.
పరబ్రహ్మశాస్త్రి ప్రకారం తేలివాహన నది అంటే గోదావరి నది అని తెలిపాడు.
కేపీ జైస్వాల్ ప్రకారం మహానది యొక్క ఉపనది అని పేర్కొనడం జరిగింది.
జైన సాహిత్యం:-
ధర్మ అమృతం అనే గ్రంథము నయసేనుడు రచించాడు. భట్టిప్రోలు ప్రాంతాన్ని ధనదుడు అనే రాజు పరిపాలించేవాడు.
ఈయన సంఘ శ్రీ అనే బౌద్ధ సన్యాసిని గుడ్డివాడిని చేస్తాడు.
అప్పుడు సంఘ శ్రీ ధనదుడు యొక్క ఏడు తరాల పిల్లలు గుడ్డి వారిగా జన్మించాలని శపించాడు. ఈ శాపం వలన ఈయన ఏడు తరాల పిల్లలు అంధులుగా జన్మించారు.
అందువలన దీనిని అంధుల దేశంగా పిలిచేవారు కాలక్రమంలో దీనినుండే ఆంధ్రుల దేశం వచ్చింది అని పేర్కొంటారు.
సంగమ సాహిత్యం:-
యాముల్న్నార్ అనే కవి ఆంధ్రులను ఉత్తరాది ప్రజలు అని పేర్కొన్నాడు.
అతని ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు తిరునల్వేలి పై దాడి చేసి మొహర్ కోటను ఆక్రమించాడు.
దశ కుమార చరిత్ర:-
దీని ఆధారంగా వేంగి ప్రాంతమే ఆంధ్ర దేశం గా పేర్కొనబడింది.
చరక సంహిత:-
ఈయన కనిష్కుని ఆ స్థానంలో వైద్యుడు. ఆంధ్రులు కలలో కనిపించినా దరిద్రం అని పేర్కొన్నాడు.
ఇండికా గ్రంథం:
ఆంధ్రదేశంలో 30 కోట్లు ఉన్నాయి అలాగే మూడువేల గుర్రాలు కలవని పేర్కొనడం జరిగింది.
భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరుడు పాలించేవాడు ఇతను భట్టిప్రోలు స్థూప శాసనం వేయించాడు ఈ శాసనం లో నగరపాలన గురించి వివరించటం జరిగింది
తారానార్:-
బిందుసారుడు అరేబియా బంగాళాఖాతం సముద్రాల మధ్య భూభాగాన్ని ఆక్రమించాడు అని దీని ద్వారా తెలుస్తుంది.
13 వ ప్రధాన శిలాశాసనం:-
దీనిని అశోకుడు వేయించాడు. దీనిలో సమకాలిక పాలకుల గురించి పేర్కొనడం జరిగింది.
ఈ శాసనం వేసే సమయంలో అశోకుని సామ్రాజ్యంలో దక్షిణ భూభాగంలో ఆంధ్రులు ఉన్నారని ఈ శాసనంలో తెలియజేయడం జరిగింది.
0 కామెంట్‌లు