ఇక్ష్వాకుల చరిత్ర | Ikswakas story in telugu | Story of Ikswakas in telugu

                             

ఇక్ష్వాకుల చరిత్ర

                 ఇక్ష్వాకుల చరిత్ర


ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు శ్రీ శాంత మూలుడు. 

వీరి రాజధాని విజయపురి దీనినే శ్రీ పర్వములు అని పిలిచేవారు. 

వీరి గురించి అల్లూరి శాసనం, ఫణిగిరి శాసనం, నాగార్జునకొండ శాసనం లలో వివరించడం జరిగింది. అయితే ఈ మూడు శాసనములను వీరపురుషదత్త వేయించాడు. 

ఇక్ష్వాకుల పరిపాలకులు:-

ఇక్ష్వాకుల పరిపాలకులు పురాణాల ప్రకారం ఏడు మంది అలాగే శాసనాల ప్రకారం నలుగురిని తెలియజేయడం జరిగింది. 

1) శ్రీ శాంతమునుడు. 

2) వీరపురుషదత్త. 

3) ఎహువల ఛాంతమూలుడు. 

4) రుద్ర పురుష దత్తుడు. 


శ్రీ శాంతమునుడు:-

ఈయన యొక్క బిరుదులు మహాదానాదిపతి, శత సామస్ర హాలక, గో శతసహస్ర, హిరణ్య కోటి ఈయనకు ఈ బిరుదులు కలవు.

అయితే శ్రీ శాంతనుడు కొన్ని శాసనాలు వేయించాడు అవి రెంటాల శాసనం, దాచేపల్లి శాసనం, కేశనపల్లి శాసనం. ఈ శాసనాలలో వారి కుటుంబీకుల గురించి మరియు వారి రక్తసంబంధీకుల గురించి తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా శ్రీ శాంతనుడు అశ్వమేధ యాగ కేంద్రమును నాగార్జున కొండ వద్ద వాడు.

ఇతని యొక్క భార్య మఠరి శ్రీ. ఇతని కుమారుడు వీరపురుషదత్త, ఈయన కూతురు అటవీ శాంతిశ్రీ. ఈయన చెల్లెలు శాంత శ్రీ, హర్ష శ్రీ. 

ఈయన తన పరిపాలనా కాలంలో అనేక యజ్ఞ యాగాలు నిర్వహించాడు. అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి దానధర్మాలు చేశాడు. విజయపురి రాజధానిగా ఇక్ష్వాకు రాజ్య స్థాపన చేశాడు. 


వీరపురుషదత్తుడు:-

ఈయన యొక్క బిరుదులు దక్షిణాది అశోకుడు, శ్రీ పర్వతాధిపతి. 

ఈయన అనేక శాసనాలు వేయించాడు వాటిలో ముఖ్యమైనవి జగ్గయ్యపేట శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, అల్లూరి శాసనం, ఫణిగిరి శాసనం, నాగార్జునకొండ శాసనం ఇవి ఇతని కాలంలో ముఖ్యమైన శాసనాలు. 

అదేవిధంగా ఇతను నేలకొండపల్లి స్థూపం నిర్మించాడు ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దది , అలాగే నాగార్జున కొండ వద్ద మహా చైతన్యం పునరుద్ధరించాడు దీనికి శిల్పకళ చేసింది భగవంత ఆనందుడు. 

ఈ యొక్క భార్య వశిష్ఠ బట్ట శ్రీ, కుమార్తె కొండ బాలశ్రీ ,కుమారుడు యెహవుల శాంతనుడు. 

ఇతను మొదట శివుని బాగా ఆరాధించేవాడు అయితే తన యొక్క భార్య మరియు అత్త ప్రభావం వలన ఈయన బౌద్ధ మతము స్వీకరించి, బౌద్ధ మతము గౌరవించ సాగాడు. 

అదేవిధంగా దక్షిణ ఇండియాలో బౌద్ధమతాన్ని చాలావరకూ వ్యాప్తి చేసి దక్షిణాది అశోకుడి గా పేరుపొందాడు. 

ఈయనకు సంబంధించిన 5 శిలలు నాగార్జున కొండ వద్ద దొరికాయి . అది బుద్ధుడు స్వర్గం నుండి వస్తున్నట్లు, వీరపురుషదత్త డు బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు, శివలింగాన్ని కాలితో తొక్కి తున్నట్లు, సాధారణ దుస్తులు ధరించి బౌద్ధ దీక్ష తీసుకున్నట్లు, దానాలు చేస్తున్నట్లు శిల్పాలు తెలుపుతున్నాయి.


 యహువల ఛాంతమూలుడు:-

ఈయన నాగార్జునకొండ శాసనమును వేయించాడు, ఇది సౌత్ ఇండియా లోనే మొదటి సంస్కృత శాసనం. అదేవిధంగా గుమ్మడిదుర్రు శాసనం వేయించాడు. 

ఈయన భారతదేశంలోనే మొదటి హిందూ దేవాలయంను నాగార్జున కొండ వద్ద నిర్మించాడు. అదేవిధంగా పుష్ప భద్ర నారాయణస్వామి శివాలయం నిర్మించాడు, దీనిని పూర్తి చేసినది హారతి పురుష వీర పురుషదత్తు. కార్తికేయ దేవాలయం,, నందికేశ్వర దేవాలయం, నవగ్రహ దేవాలయం నాగార్జునకొండ వద్ద నిర్మించాడు. 

ఇతని యొక్క సేనాపతి ఎల్లసిరి, ఈయన ఏలేశ్వరం లో కుమారస్వామి దేవాలయము నిర్మించాడు. 

అదేవిధంగా ఈయన దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనము వేయించాడు. భారతదేశంలోనే మొదటి హిందూ దేవాలయం నిర్మించాడు. ఈ యొక్క భార్య బహు తీయ అనే బోధన్ శాఖకు దానధర్మాలు చేసి ఆదుకుంది. 

రుద్ర పురుష దత్తుడు:-

ఈయన గురజాల శాసనం,నాగార్జునకొండ శాసనం వేయించాడు. 

అదేవిధంగా బహు తీయ బౌద్ధ సన్యాసుల కొరకు విహారాన్ని నిర్మించాడు. 

సమాధులపై ఛాయా స్తంభాలను ఏర్పాటు చేశాడు. అలాగే వీరుల యొక్క విగ్రహాలను ప్రతిష్టించాడు. 

వీరిని కమ్మ రాష్ట్రము పాలిస్తున్న తొలి పల్లవులు దాడి చేయడం వలన ఇక్ష్వాకులు పతనం అయ్యారు వీరిపై దాడి చేసిన తొలి పల్లవులు వారే కింది వారు. 

సింహం వర్మ ఈయన ఈ దాడులను manchikallu శాసనంలో వివరించాడు, ఈ manchikallu శాసనం ఏపీలో తొలి పల్లవుల శాసనం . 

శివ స్కంద వర్మ ఇతను మైదవోలు శాసనం వేయించాడు. 

 

ఇక్ష్వాకుల సాంస్కృతిక

శాతవాహన కాలం నాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఇక్ష్వాకుల కాలంలో కూడా కొనసాగాయి. 

వీరి కాలంలోనే మిశ్రమ సంస్కృతి అభివృద్ధి చెందింది. వైదిక బౌద్ధ మతాలు వర్ధిల్లాలి

ఇక్ష్వాకుల కాలంలోనే బుద్ధుడు మహా విష్ణువు యొక్క9 అవతారంగా పరిగణించబడతాయి. దీంతో బౌద్ధమతం కొంతవరకు ఉనికి కోల్పోయింది. 

బౌద్ధమతంలో ప్రధానంగా రెండు శాఖలు ఉంటాయి అవి మహాయానం, హీనయానం

మహాయానం అంటే బుద్ధుని దేవుని గా పరిగణించి పూజించి ప్రత్యేక . 

హీనయానం వీరు బుద్ధుని మహా పురుషునిగా పరిగణిస్తారు, విగ్రహారాధన చెయ్యరు. 

ఇక్ష్వాకులు మహాయాన బౌద్ధమతాన్ని ఆదరించాడు, బుద్ధుని పూజించుటకు అనేక విగ్రహాలను రూపొందించారు.

ఇదే అమరావతి శిల్పకళగా ప్రసిద్ధి చెందింది. ఈ శిల్ప కల లో రామతీర్థం, జగ్గయ్యపేట, విజయవాడ, ఫణిగిరి లవద్ద శిల్పకళను పొందుపరిచారు. 

అదేవిధంగా నాగార్జునకొండ మహాయాన బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా మారింది, ఈ నాగార్జునకొండ నే దక్షిణాది గయ అంటారు. శ్రీ పర్వత బౌద్ధ విశ్వవిద్యాలయం ఇక్ష్వాకుల కాలంలోనే ప్రారంభం అయ్యింది. ఇది భారతదేశంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయం . అదేవిధంగా నాగార్జునకొండ ప్రముఖ వర్తక కేంద్రంగా మారింది. ఇక్ష్వాకుల కాలంలో మొదటగా ప్రారంభం అయినవి:-

మేనత్త కుమార్తెలను వివాహం ఆడుట. 

సంస్కృతంలో శాసనాలు రాయటం. 

శాసనాల పై సంవత్సరాలను లిఖించడం. 

హిందూ దేవాలయాలను నిర్మించటం. 

నిర్మాణాలపై శిల్పుల పేర్లు రాయటం. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు