వరిని ఆశించే తెగుళ్ళు | paddy field insects | paddy farming

                  

                  వరిని ఆశించే తెగుళ్ళు

వారిని ఆశించే తెగుళ్లు 6 రకాలు


1. అగ్గి తెగులు- పైరిక్యులేరియా ఒరైజె


లక్షణాలు

అగ్గి తెగులు వరి పైరు ఏ దశలోనైనా ఆశించవచ్చు వరి ఆకులపైన మొక్క యొక్క కనుపు పైన మరియు వరివెన్ను పైన వస్తుంది అగ్గి తెగులు నారుమడిలో వచ్చినట్లయితే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది వరి నాట్లు పూర్తి అయిన తర్వాత అగ్గి తెగులు సోకిన అట్లయితే తెగులు సోకిన మొక్కలు గిడబారి ఉంటాయి. పూర్తి అయిన తర్వాత అగ్గి తెగులు సోకి నట్లయితే తెగులు సోకిన మొక్కలు.గిడసభారిఉంటాయి. మరియు పిలకల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆకులపై చిన్నచిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలో గల మచ్చలు ఏర్పడతాయి పండు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది తెగుళ్లు పెరిగే కొలది మచ్చల సంఖ్య మరియు పరిమాణం పెరిగి ఒకటి కలిసి వరి మొక్కల ఆకులు ఎండిపోయి చూడటానికి ఈ పైరు నిప్పు తో తగలబెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆగు పడుతుంది.

ఈ తెగులు ఓరి యొక్క అణువులు సోకినప్పుడు మొక్కలను కణుపు ల పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద విరిగి పడిపోతుంది . వరి మొక్క వెన్ను పైకి వచ్చే దశలో సోకిట్లయితే లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి దీనివల్ల మెడ దగ్గర విరిగి వ్రెలడడం  గానీ జరుగుతుంది అందువల్ల దీనిని మెడ విరుపు తెగలు అని అంటారు.

వ్యాప్తి

ఏ శిలీంద్రము మొక్కల అవశేషాలను విత్తనాలను మరియు కలుపు మొక్కల పై జీవిస్తుంది గాలి ద్వారా ఒక్క మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు వ్యాప్తి ఒక వారం రోజులు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే వ్యాధి త్వరగా వృద్ధిచెంది పంటను నాశనం చేస్తుంది. జాగ్రత్త 20 నుంచి 22 సెంటిగ్రేడ్ ఉండి గాలిలో తేమ 90 శాతం ఉండి మంచు గాని వర్షపు జల్లులు గానీ పడటం వలన వ్యాధి ఇది ఈ అనుకూల వాతావరణం మహారాష్ట్రలో నవంబర్ ఫిబ్రవరి వరకు ఉంటుంది వరి నాట్లు దగ్గరదగ్గరగా వేయటం మరియు నత్రజని ఎరువుల ను అధికంగా వేయుట వలన కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది


నివారణ


1.నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి

2. గట్లను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి

3. నత్రజని సిఫారసు చేసిన మోతాదు రెండు నుండి మూడు సార్లు వేయాలి

4. థైరాన్ లేదా కెప్టెన్ 2.5 గ్రాములు లేదా ట్రైసైక్లోజోల్ రెండు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి

5. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఎడి పెన్ పాస్ ఒక మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

6. తెగులు తట్టుకున్న రకాలైన సింహపురి,తిక్కన, శ్రీరంగ, పాల్గుణ, స్వర్ణధన్, స్వర్ణముఖి , ఎమ్ టి యు 7414, స్వాతి, ఐ ఆర్ 64, శ్రావణి ఒంటి రథాలను తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సాగు చేయాలి


2. పొడ తెగులు లేక పాము పొడ తెగులు


కారకం- ఈ వ్యాధి రైజో క్టోనియ సొలని  ను శిలీంద్రము ద్వారా వ్యాప్తి చెందుతుంది

లక్షణాలు

సామాన్యంగా వరి యొక్క పిలకలు పెట్టు దశనుండి ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు పాము కూడా ఒంటి మచ్చలుగా మారుతాయి ఈ మచ్చలు ఒక క్రమపద్ధతిలో ఉండవు చుట్టు గోధుమ వర్ణం కలిగి మధ్యభాగం బూడిద రంగులో ఉంటుంది

వరి మొక్కలు వెన్నెల పైకి తీయు దశలో పై ఆకులు కూడా ఈ సిలింద్రం వ్యాపించి ఆకులపై మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు మరియు మొక్కలు కూడా ఎండిపోతాయి

వరి మొక్కలు పిల్లలు పెట్టే దశలో సాగినప్పటికీ వెన్ను పైకి దశలో పై ఆకుల ఎండిపోతున్న టు సమయంలో గుర్తు గుర్తించడం జరుగును ఏర్పడిన మచ్చలపై ఆవగింజ పరిమాణంలో ఈ నల్లటి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి చేయబడతాయి

వ్యాప్తి

వరి పైరు కోసే సమయంలో ఈ బీజాలు కొన్ని రాలిపోయి మరికొన్ని ధాన్యంతో కూడా కలుస్తాయి ప్రవాహం ద్వారా మొక్కలపై గాక చాలా రకాల గడ్డిజాతి కలుపు మొక్కల పై కూడా వృద్ధి చెందుతుందని వాతావరణంలో ఉష్ణోగ్రత 23-35 సెంటిగ్రేడ్ మధ్య ఉన్నప్పుడు నాట్లు దగ్గరదగ్గరగా నాటినపుడు అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు ఈ తెగులు అధికంగా వృద్ధి చెందుతుంది

నివారణ

1. మంచి విత్తనాన్ని ఎన్నుకొని 2 నుండి 3 గ్రాముల మ్యారికో జెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.

2. నత్రజని ఉన్న ఎరువును రెండు నుండి మూడు దఫాలుగా వేయాలి

3. తెగులుకు నివాసమైన గడ్డిజాతి కలుపుమొక్కలను తీసివేశారు ఈ పొలం గట్ల ను శుభ్రంగా ఉండేలా చేయాలి

4. పిలక దశలో తెగులు లక్షణాలు కనిపించినప్పుడు ఒక మిల్లీ ప్రోపినో కొనజోల్  లేదా రెండు మిల్లీ లీటర్లు  హెక్సకొనాజోల్ లేదా రెండు మిల్లీ లీటర్లు వాలిడ మైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


3. పొట్ట కుళ్ళు తెగులు


కారకం- ఈ వ్యాధి సారోక్లోడియం సిలింద్రాలు ద్వారా వ్యాపిస్తుంది

లక్షణాలు

వరి యొక్క పొట్ట దశలో ఉన్నప్పుడు పంటకు ఈ వ్యాధి  సోకుతుంది. వరి యొక్క వెన్ను పైకి తీయు దశలో ఈ వ్యాధి లక్షణాలు బాగా కనిపిస్తాయి. ఈ శిలీంద్రము సామాన్యంగా వరి మొక్కల పై చేసే గాయాల ద్వారా ప్రవేశించి ఆకుల లోపల నుండి పూర్తిగా బయటకు రానివ్వదు సగభాగం మాత్రం బయటికి వచ్చి మిగతా భాగం పొట్ట ఆకులో ఉంటుంది పొట్ట భాగంలో ఆకుల కోలగా గాని లేక క్రమపద్ధతిలో గానీ లేని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది తెగుళ్లు సోకడంతో వలన పైకి వచ్చిన వెన్నుపై ఉండే గింజలు గడ్డి రంగు గింజలు మరియు ఆకుల లోపల గింజలు నలుపు రంగులో ఉంటాయి రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల లోపు ఉండి మంచి మరియు వాతావరణం చల్లగా ఉండటంతో ఈ వ్యాధి వృద్ధికి దోహదం చేస్తాయి గాలి ద్వారా వ్యాప్తి చెంది కీటకాలు చేసిన గాయాల నుండి మొక్కల లోపలికి ప్రవేశిస్తాయి . ఆకును గాయపరిచే కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల వల్ల వెన్ను బయటకి పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.

నివారణ

1. పైరు పొట్ట దశలో ఒకసారి తెగులు కనిపించిన వెంటనే ఒక సారి కార్బండిజమ్ 0. 5 నుండి 1.0 గ్రాములు లేదా బెనోమిల్ లీటరు నీటికి కలిపి రెండుసార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలి.

2. నత్రజని ఎరువులను మూడు నుండి నాలుగు దఫాలుగా వేయాలి


4. బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు లేక బ్యాక్టీరియల్ బ్రైట్


కారకం- జంతోమోనాస్ కంపెట్రిస్ ఒరైజే  అను బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది


లక్షణాలు

ఈ తెగులు వరి పైరు ముఖ్యంగా మూడు దశల్లో ఆశిస్తుంది

1. నారుమడిలో సోకి నట్లయితే ఆకులు చివర్ల నుండి కింది వరకు రెండు పక్కల తడిసినట్లు ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోవును దీనిని క్రెసక్ దశ అని అంటారు. ఈ ఎండిన మచ్చలు తరంగాల మాదిరి గా ఉంటాయి నాట్లు వేసిన 30 రోజుల తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు

2. పిలకలు పెట్టు దశలో ఈ క్రింది వరకు ఆకులు పసుపుపచ్చగా మారి తెగులు సోకిన భాగాలు ఉదయం ఏడు గంటలకు ప్రాంతాల్లో తెగులు సోకిన ఆకు నుండి పచ్చని జిగురు వంటి పదార్థం పైకి వచ్చును ఈ పచ్చటి పదార్థము సూర్యరశ్మికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా మారి చిన్నప్పుడు ఆకు నుండి దాని ప్రేమలో ఉన్న నీటిలో పడతాయి నేటి3. ఉన్న బ్యాక్టీరియా ఇతర మొక్కలు మరియు పొలాలకు చేరుతుంది.

3. వరివెన్ను పైకి తీయు దశలో ఈ తెగులు సోకి ఆకులోని హరిత పదార్థము తగ్గుట వలన కొన్ని వెన్నెల సగం మాత్రమే బయటకు రావడం జరుగుతుంది తాలు గా మారతాయి ఉష్ణోగ్రత 30 సెంటి గ్రేడ్ లో తేమ అధికంగా మరియు వర్షపు జల్లులు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది.

నివారణ

1. ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించాలి

2. నత్రజని ఎరువులను మూడు నుండి నాలుగు దఫాలుగా వేయాలి

3. తెగులు 5 శాతం కంటే ఎక్కువ అయితే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలిపి వేయాలి.

4. సాగునీటిని తెగులు సోకని పొలం నుండి తెగులు ఆశించిన పొలాలకు పడకుండా చూడాలి.

5. తెగులును తట్టుకునే రకాలైన ఎన్ టి యు 9992, స్వర్ణ, గోదావరి, ఇంత, రుద్రమ, తెల్ల హంస, వంటి రకాలను సాగు చేయాలి

6. తెగులు కనిపించిన వెంటనే స్ట్రెప్టోమైసిన్ లేదా పోష మైసిన్ 200 పి పి ఎం మందును10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.


5. టుంగ్రో వైరస్


రెండు కారకాల  వైరస్ల కలయిక వలన వస్తుంది


1. రైస్ టుoగ్రో బాసిల్లి ఫామ్ వైరస్

2. రైస్ టుంగ్రో స్పెరికల్ వైరస్

లక్షణాలు

తెగులు సోకిన వరి మొక్కలు కురచగా ఉండి  సరిగా ఎదగవు మరియు చాలా తక్కువ పిల్లలు పుడితే ఆకులు లేత ఆకుపచ్చ లేత నారింజ రంగులోకి మారతాయి ఆకులపై తెల్లటి లేక పసుపు వర్ణపు చారలు కలిగి ఉంటాయి లేత ఆకులు వదిలినట్టు గా ఆకులు కురచగా ఉండే లేత ఆకులు బయటికి రాకుండా ఒక దానిలో ఒకటి ఉంటాయి ముదురు ఆకులు ఈనెలు మందంగా ఉంటాయి మొక్కల వేర్లు పూర్తిగా వృద్ధి చెందగా పోవడము మరియు పెన్నులు చిన్నవిగా ఉండి తో నిండి ఉంటాయి.

వ్యాప్తి

ఈ తెగులు పచ్చ దీపపు పురుగులు సెప్టెంబర్ 2 వారం వరకు  సామాన్యంగా మార్చి ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉంటాయి.

నివారణ

1. తెగులు తట్టుకున్న రకాలైన ఎన్ టి యు9992,1002,1003,1005, సురక్ష, విక్రమ్ ఆర్య, భరణి, ఐ ఆర్ 36, వేదగిరి వంటివాటిని సాగు చేయాలి.

2. పంట కోసిన తర్వాత దుబ్బుల ను నాశనం చేయాలి

3. వరి పిల్లలను పడి మొక్కలను నాశనం చేయాలి.

4. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి

5. తెగులు ప్రతిసారి క్రమం తప్పకుండా కనిపించే ప్రాంతాలలో వారికి బదులుగా పప్పు నూనె గింజల సాగు చేయాలి

6. వ్యాప్తి చేసే పచ్చ దీపపు పురుగుల నివారణకు ఎకరాకు 10 కిలోల కర్బాఫ్యూరన్ గుళికలను వేయాలి. లేదా లీటరు నీటికి2.2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా1.5 మిల్లీలీటర్లు ఇతోఫెన్ పాస్ కలిపి పిచికారి చేయాలి.


6. గోధుమరంగు ఆకు మచ్చ తెగులు


కారకం- హెల్మెంతొ స్పోరియం ఓరైజే

లక్షణాలు

సరైన యాజమాన్య పద్ధతులను చేపట్టని ప్రాంతాలలో గోధుమ మచ్చ తెగులు ఎక్కువగా కనబడుతుంది. ఆకులపై అండాకారము గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మధ్యభాగంలో బూడిద రంగులో కనబడుతుంది. గింజలపై ముదురు గోధుమ రంగు లేక నల్లని మచ్చలు ఏర్పడును.

తెగులు మూడు దశలలో చూడవచ్చు

1. మొలక రాకముందు:- ఈ దశలో మొలకెత్తిన విత్తనాలు నేలపైకి రాకముందే కుళ్లి చనిపోతాయి

2. మొలక దశ:- మొలక మీద గుండ్రని గోధుమరంగు మచ్చలు ఏర్పడును ఈ మచ్చలు నువ్వు గింజ ఆకారంలో ఉండి తెల్లని మచ్చలు గా కనబడతాయి

3. మెడ ఎండుట:- కొన్నిసార్లు తెగుళ్లు వెన్నుకు సక్రమం చేయడం ద్వారా తీవ్రంగా కనబడుతుంది కానీ తెగులు సోకిన వెన్ను విరగదు

ఈ తెగులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది గాలి ద్వారా సంక్రమిస్తుంది.

నివారణ

1.మాంకోజెబ్ 3 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి

2. సమతుల్య ఎరువులను వాడుకోవాలి

3. ఒక గ్రాము కేజీ విత్తనానికి తైరన్ లేదా క్యాప్టెన్ తో విత్తనశుద్ధి చేయాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు