వరి- ఒరైజా సటైవా
ప్రపంచంలోఎక్కువ మంది ప్రజలకు ముఖ్యమైన ఆహార పంట వరి
వరి పండించడానికి తగిన యాజమాన్య పద్ధతులు
1.ముందుగా ఎక్కువ నీటిని నిలుపుకునే నేలలు వరి పండించడానికి ఎంచుకోవాలి
2. వరి పంట వేయడానికి నారుమడి తయారుచేసి నారుమడిలో ఒక రోజు అంతా నానబెట్టి నానబెట్టిన విత్తనాలను చల్లాలి విత్తనాలు మొలిచే వరకు పక్షులు జంతువులు తొక్క కుండా జాగ్రత్త పడాలి
3. నారు 18-23 రోజుల మధ్యలో బాగా దమ్ము చేసిన ప్రధాన మడిలో నాటుకోవాలి
4. నాట్లు నటేటప్పుడు భూమిలో ఉండే సారాన్ని అనుసరించి కరిఫ్ అయితే 23 మూనలు రబీలో అయితే 44 మూనాలు నాటుకోవాలి
వరి పంటకు ఆశించే చీడ పురుగులు మరియు వాటి యాజమాన్యం
వరి పంటకు 14 రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి
1.కాండం తొలుచు పురుగు
3. నారు 18-23 రోజుల మధ్యలో బాగా దమ్ము చేసిన ప్రధాన మడిలో నాటుకోవాలి
4. నాట్లు నటేటప్పుడు భూమిలో ఉండే సారాన్ని అనుసరింం
వరి పై ఆశించే వివిధ పురుగులలో కాండం తొలుచు పురుగు అతి ముఖ్యమైనది. మొదట గుడ్డు నుండి బయటకు వచ్చిన గొంగలిపురుగు కొన్ని గంటలు ఆకులపై తిరుగుతూ ఆకులలో పత్రహరితాన్ని గోకి తింటూ తర్వాత ఊలు దారంతో వేలాడుతూ లేదా కాండము చివరి తొలి భాగంలో రంధ్రం చేసి లోపలి భాగాలను తింటూ జీవిస్తాయి. ఈ పురుగు వరి వంట పిలకలు వేసే దశ లేదా చిరు పొట్ట దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. నువ్వు చిరు పొట్ట దశలో లేదా కంకి బయటకు వచ్చే దశలో ఆశించినట్లు అయితే తయారవుతున్న గింజలకు పోషకాలు అందక తాలు గింజలు గా మారి తెల్ల కంకి ఏర్పడుతుంది
ఈ పురుగు ను నివారించుటకు తట్టుకునే రకాలైన రత్నా, సస్య శ్రీ, వికాస్, గౌతమి, ఐ. ఆర్ 20-26 ఆర్. పి- 2815 రకాలను సాగు చేయాలి. వరి నారు కట్టలను క్లోరో ఫైరిపాస్ 20% ఈసి ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి దానిలో వరి నారు కట్టలను రెండు గంటలపాటు ఉంచి ప్రధాన పొలంలో నాటి నట్లయితే 20 నుండి 25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు పైరు ఆశించకుండా కాపాడు కోవచ్చు. ఈ పద్ధతిని "సిడ్లింగ్ రూట్ "డిప్ పద్ధతి అని అంటారు. ఈ పురుగు తల్లి పురుగు కాంతికి ఆకర్షింప బడుతుంది కనుక అక్కడ అక్కడ దీపపు ఎర్రలను అమర్చి తల్లి పురుగునునాశనం చేయవచ్చు. తల్లి పురుగు ఉనికిని గమనించుట కొరకు 1ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటుచేయాలి. ఈ పురుగు నివారణ కొరకు చిరుపొట్ట దశకు ముందుగా carbofuran 3g గుళికలను 8-10 కిలోలు లేదా కర్టప్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. రసాయనిక పురుగుమందు లైన ఎసిపెట్ 1.5 గ్రాములు లేదా కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు paspomidan 2.0 మిల్లీలీటర్లు లేదా క్లోరంట్ర నిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
2.వరి ఉల్లికోడు
గ్రుడ్డు నుండి బయటకి వచినవెంటనే పిల్ల గొంగళి పురుగులు కాండం లోనికి చొచ్చకొని పాయి అంకురం వద్ద వృద్ది చెందుతాయి. పురుగు పైరు దశలో ఆశించినట్లు అయితే పురుగు సోకినా దుబ్బుల నుండి ఎక్కువ పిలకలు వస్తాయి.ఈ పిలకల నుండి కంకులు ఏర్పడవు. ఈ పురుగు నారు మడి నుండి పిలక దశ వరకు ఆశించి నష్ట పరుస్తాయి. పిలక దశ దాటిన తర్వాత ఈ పురుగు పైరును ఆశించదు. పురుగు తాకిడి ఆలస్యంగా నాటిన వరి పైరు లో ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ తట్టుకునే రకాలు అయిన పోతన, దివ్య, కావ్య, ఎర్రమల్లెలు, కేశవ, ఓరుగల్లు, భద్రకాళి శివ ,సురేఖ ,సురక్ష ,స్వర్ణముఖి ,సుమతి ,శ్రీకాకుళం సన్నాలు, జగిత్యాల సన్నాలు, పొలాస, వరాలు మరియు ఇందూర్ సాంబ మొదలగునవి సాగు చేయాలి. నారుమడిలో నారు తీయుటకు వారం రోజుల ముందుగా పో రేట్ 10g సెంటుకి 50గ్రాములులేదా carbofuran 3g 160 గ్రాములు వేయాలి. పది ,పదిహేను రోజులకు పోరెట్ 10g 5కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ 3g 10కిలోలు వేసుకోవాలి క్లోరో పైరిపాస్ 2.5 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
3. సుడి దోమ
పురుగు మొదట్లో పొలంలో అక్కడ అక్కడ సుడులు సుడులుగా లేక వలయాకారంలో పంట ఎండిపోతోంది ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పైరు మొత్తం ఎండిపోతుంది. ఈ పురుగు గ్రాసి స్టంట్ మరియు రాగ్డ స్టంట్ వైరస్ తెగులు వ్యాప్తి చేస్తాయి. ఈ పురుగును తట్టుకునే రకాలైన విజేత ,ఇంద్ర ,ప్రతిభా ,అమర, కాటన్, దొర సన్నాలు ,శ్రీ దృతి ,రకాలను నాటుకోవాలి. సిఫారసు చేసిన మేరకు నత్రజని ఎరువులను వేసుకోవాలి. పొలాన్ని తరచూ ఆరబెట్టాలి. బుప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా డ్యూనోటే ప్యూరన్0.4g లేదా ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 0.25 లేదా పై మెట్రోజెం 0.6 లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీలీటర్లు+ dichloro1.0 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదట్లో పిచికారి చేయాలి. ప్రతి రెండు మీటర్లకు కాలిబాటల్లోనూ వదలాలి దీనినే "అల్లిస్" అని అంటారు
4. తెల్ల మచ్చ దోమ
పిల్ల మరియు పెద్ద పురుగులు మోక్క నుండి రసం పీల్చుట వలన మొదటగా అవి పసుపుపచ్చగా మారి తర్వాత గోధుమ రంగులోకి మారతాయి దీనిని హపర్ బర్న్ అంటారు. ఈ పురుగు విసర్జించిన మలం మీద శిలీంద్రాలు పెరగడం వలన సూటి మోల్డ్ ఏర్పడుతుంది
5.పచ్చ దోమ /దీపపు పురుగులు.
పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులు మరియు మొక్కల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు లేదా గోధుమ రంగులోకి మారి మొక్కల గడస బారిపోతాయి. ఈ పురుగులు వరి లో rice tungro virus ఈ వ్యాధిని కలుగ చేస్తాయి ఈ వ్యాది సోకిన మొక్కలు పెరుగుదల తగ్గి ఆకులు లేత పసుపు లేక నారింజ రంగులోకి మారతాయి గింజలు పలుచగా ఉండి కంకి బయటకు రాదు. వ్యాధి పిలక దశలో మాత్రమే ఆశిస్తుంది. ఈ పురుగును తట్టుకొనే రకాలైన విక్రమ్ ఆర్య, త్రిగుణ ,దీప్తి, సురక్షలను ,నాటుకోవాలి. సిఫారసు మేరకు నత్రజని సంబంధమైన ఎరువులను వేయాలి. వైరస్ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఎకరానికి carbofuran 3g 10 కేజీ లేదా మోనోక్రోటోఫాస్ 2.2 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
6.ఆకు ముడుత పురుగు
ఈ పురుగులు వరి పైరు పిలక వేసే దశనుండి ఆశిస్తాయి చిరు పొట్ట దశ నుండి అభి వృద్ధి చెంది వెన్ను వేసే దశలో దీనిని ఉధృతి అధికమవుతుంది. పైరు పిలక దశలో కొబ్బరి తాడును చేసుకుని అడ్డంగా రెండు నుండి మూడు సార్లు లాగితే క్రింద పడిపోతాయి. రసాయనిక పురుగు మందులు అయినా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు కార్ టాప్ హైడ్రో క్లోరైడ్ 2.0 గ్రాములు లేదా ఫ్లోర్ 0.3 మిల్లీ లీటర్ల ను ఒక లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి వృత్తిని బట్టి 8 నుండి 10 రోజుల వ్యవధిలో ఒక సారి పిచికారి చేయాలి. దుబ్బుకు ఒకటి నుండి రెండు పూర్తిగా నష్టపోయిన ఆకులు ఉంటే నివారణ చర్యలు చేపట్టాలి.
7.తాటాకు తెగులు
దీని వలన మనము పొలమును దూరం నుండి చూసినట్లయితే సున్నం వేసినట్లుగా కనిపిస్తోంది సున్నపు తెగులు అని కూడా అంటారు. ఈ పురుగు నారు మడిలో ఆశించినట్లు అయితే నారు నాటే ముందు కొనలను తుంచి నాటుకోవాలి. రసాయనిక పురుగుమందు లైనా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటర్లు లేక క్వినాల్ పాస్2.0 మిల్లీలీటర్లు లేక క్లొరో పైరి పాస్ 2.5 మిల్లీ లీటర్లు లేక ప్రపినో పాస్ 2.0 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
8.ఆకు చుట్టు పురుగు లేక ఆకు గొట్టము పురుగు.
ఈ పురుగు గొట్టము లోపల ఉండి తల బయటకు పెట్టి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై చారలు ఏర్పడతాయి పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నీటిపై తేలియాడుతున్న గొట్టాలను గమనించవచ్చు. దశలో ఉన్నప్పుడు పై రూపాయి కొబ్బరి దాడి నువ్వు చేసుకుని చేనుకు అడ్డంగా రెండు నుండి మూడు సార్లు లాగితే పురుగులు క్రిందకు పడిపోతాయి తరువాత మురుగు నీటిని తీసివేయాలి. రసాయనిక మందులు అయినా క్వినల్ పాస్ 2.0 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటర్లు కార్బరిల్ 3.0 గ్రాములు లేక ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
9.
ఒక కంకి లోని కొన్ని గింజలు మాత్రమే మారతాయి గింజలు పూర్తిగా అభివృద్ధి చెందవు చెందిన మిల్లుకు వేసినప్పుడు నూకలు గా మారతాయి. ఈ పురుగు ఆశించిన పైరు నుండి సేకరించిన గడ్డి పశువులకు మేతగా పనికిరాదు పొలం నుండి చెడు వాసన వస్తుంది. పురుగు నివారణ కొరకు రసాయన మందులు అయిన మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు మలాథియాన్ 2.0 మిల్లీలీటర్ల ను dichlorvos 1.0 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
గమనిక:- పురుగు మందులను పిచికారీ చేసే టప్పుడు పొలంలో అంచు నుండి చుట్టూ తిరుగుతూ పొలం మధ్యలోకి పిచికారి చేయాలి.
10. రెల్ల రాల్చు పురుగు
గొంగళి పురుగు గింజ గట్టిపడే దశలో పైరును రాత్రివేళ ఆశించి కంకులను కత్తిరించి వేస్తాయి కత్తిరించిన కంకులు రాలిపోవును. సాధారణంగా గొంగళి పురుగు పురుగు పగటిపూట మొక్క మొదళ్లలో పిలకల మధ్య దాగి పైరుపై రాత్రి ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు కంటి బయటకు రాకముందు ఆశించినట్లు అయితే గొంగలిపురుగు ఆకులను తిని నష్టాన్ని కలుగజేస్తాయి. నివారణ పద్ధతులను ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చేపట్టాలి. ఈ పురుగు నివారణ కొరకు ఇక పురుగుమందు లైన్ క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేక మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల తో dichlorvos 1.0 మిల్లీలీటర్ల ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
11.మిడతలు
ఆకులను అంచుల నుండి ఆకారం లేకుండా కత్తిరి స్థాయి. నారుమడి లోనూ నాటిన పొలం లోనూ లేదా మొక్కలను మొదళ్లకు కత్తిరించి వేస్తాయి ఒక్కొక్కసారి వెన్నెలను కూడా కత్తిరించేస్తాయి. మోనో క్రోటో పాస్ 1.6 మిల్లీ లీటర్లుతో క్లోరో పైరీ పాస్ 2.5 మిల్లీ 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
12. పేను లేక తామర పురుగు
పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులోని రసాన్ని పీలుస్తూ జీవిస్తాయి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముడుచుకొని ఉంటాయి ఆకులు పాలిపోయి పైరు ఎండిపోయినట్లు కనిపిస్తుంది. రసాయనిక మందులు అయిన మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటర్లు లేక ఫిప్రోనిల్ 2.0 మిల్లీ లీటర్లు లేక పాస్పమిడాన్ 2.0 మిల్లీలీటర్లులేదా ఏసీ పేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
13. ఆకు నల్లి
తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఉండి ఆకు అడుగు భాగమున రసాన్ని పిలుస్తూ జీవిస్తాయి. ఈ పురుగులు రసాన్ని పీల్చడం వలన ఆకులు పాలిపోయి పైరు ఎండిపోయినట్లుగా కనబడును. ఈ పురుగు నివారణ కొరకు నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములు లేక డైకోఫాల్ 1.5 మిల్లి లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి.
14. కంకి నల్లి లేక పానికల్ మైట్
ఇవి కంటికి కనిపించని సూక్ష్మ సాలీడు వర్గానికి చెందినవి ఇవి ఆశించిన ఆకులపై పసుపు వర్ణపు చారలు ఏర్పడి క్రమేపి ఆకు అడుగు భాగాన ఈ నెలలో వృద్ధిచెందుతాయి ఆగు అడుగుభాగాన మరియు ఆకు తోడిమల పై నల్లటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కంకి వచ్చిన తర్వాత గింజల నుండి రసాన్ని పీల్చుకుంటాయి గింజల పై నల్లటి మచ్చలు ఏర్పడి పాలుపోసు కోకుండా తాలు గింజలు అవుతాయి సాధారణంగాఈ పురుగు బెట్ట పరిస్థితులలో పైరు పై ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు నివారణ కొరకు రసాయన పురుగు మందులు అయినా డైకో ఫాల్ 5.0 మిల్లీలీటర్లు లేకపోయినా పాస్ 2.0 మి.లీ లీటర్లు నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేయాలి.
0 కామెంట్‌లు