కంది -కజానస్ కజాన
ఈ పంట ఆఫ్రికాలో అవిర్బ వించింది
1.కంది పంటను పప్పు దినుసులు గా ఉపయోగిస్తారు
2.కంది పంటను ఎక్కువగా మెట్ట ప్రాంతాలలో పండిస్తారు.
3.కంది పంటను జూన్ -జూలై లేక అక్టోబర్ నెలలో విత్తుకుంటారు. ఈ పంట కాలం 160 180రోజులు వుంటుంది. ఈ పంటకు చీడపీడలు ఎక్కువగా వస్తాయి. తగిన జాగ్రత్తలు తప్పని సారిగా పాటించాలి.
4. కంది పంటను కరిఫ్ లో వర్షాధార పంటగా పండిస్తారు. కానీ చివరి దశలో బెట్టకు గురి ఐతే. 1,2 తడులు నీళ్ళు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచ వచ్చును
5.విత్తనాలు విత్తేముందు కలుపు నివారణ కొరకు ఫ్లుక్లోరాలిన్ ఎకరాకు లీటరు చొప్పున200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి
కంది పంటను 13 రకాల పురుగులు ఆశించి నష్ట పరుస్తాయి
1.శనగ పచ్చ పురుగు -హెలికోవర్పా అర్మిజెరా
గ్రుడ్డు నుండి బయటకి వచ్చిన గొంగళి పురుగు మొదట ఆకుల పత్రహరితాన్ని లేక పువ్వు మొగ్గల రేకులను గోకి తింటాయి. తర్వత పెరిగిన పురుగు ఆకులను,మొగ్గలను, పూలను, మరియు కాయలను తొలచి నష్ట పరుస్తాయి. కానీ ఇది ఫలదీకరణం చెందిన తర్వత ఏర్పడిన కాయలను విపరీతంగా ఇష్ట పడుతుంది. ముఖ్యంగా గొంగళి పురుగు కాయలను తొలచి గుండ్రటి రంధ్రాన్ని చేసి దానిలో సగబాగము శరీరము లోపలికి చోప్పించి మిగిలిన భాగమును బయటికి పెట్టి కాయలోని గింజలను మొత్తం తిని డొల్ల చేస్తుంది. ఇది ఈ పురుగు యొక్క ప్రత్యేకత. ఈ పురుగు నివారణ కోరకు సస్య రక్షణ పద్దతులను చేపట్టలి. ఎర పంటగా బంతిని అక్కక అక్కడ వేయాలి. లింగా కర్షన బుట్టలను ఎకరాకు 4చొప్పున పెట్టీ తల్లిపురుగు వునుకిని గమనించాలి. గ్రుడ్డు మరియు తొలి దశ పురుగు గమించిన వెంటనే వేపకషయం 5/ లేక వేప సంబంధిత మందులను 5.0మిల్లి లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పెరిగిన గొంగళి పురుగు నివారణకు క్వినాల్ పాస్ 2.0 మిల్లి లీటర్లు లేక మోనొక్రోటోపాస్ 1.6 మిల్లీ లీటర్ల లేక ప్రోఫినో పాస్ 2.0 మీల్లి లీటర్లు లేక థయోడికర్బ్ 1.0 గ్రాములు లేక నోవల్యురాన్ 1.0మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచకారి చేయాలి.
2.కందికాయ తోలిచే అకుపచ పురుగు -ఇంటియెల్ల జింకెనెళ్ల
గొంగళి పురుగు తొలిదశలో పూ మోగ్గల పై అసించి తర్వత కాయల పై రంద్రము చేసి లోపలి తొలుచుకుని ప్రవేశించి విత్తనాన్ని మొత్తం తింటాయి. ఇవి తయారైన విత్తనాలను ఎక్కువగా తింటాయి. కాయలను వలచి చూసినట్లయితే ఇవి విసర్జించిన మలినము మరియు గొంగలి పురుగును గమనించవచ్చును. సాధారణంగా ఈ పురుగు పంటపై కాయదశలో ఆశించును.
3. మరుకా మచల్ల కాయ తొలుచు పురుగు- మారుకా విట్రేటా
పిల్ల గొంగళి పురుగు ఆకులను పూ మొగ్గలను లేక పువ్వును గోకి తింటాయి. గొంగళి పురుగులు. ఆకులను లేదా మొగ్గలను గుడుగా చేసుకుని వాటిలో వుండి లోపలి భాగాలను తింటుంది అంతేకాక పురుగు కాయలకు చిన్నని రంద్రం చేసి కాయలోనికి ప్రవేశించి గింజలను తింటూ జీవిస్తుంది. కాయమీద వున్న రంద్రం చిన్నగా వుండి ఈ పురుగు విసర్జించిన మాలినము రంద్రము నుండి బయటకు రావడం గమనించవచ్చు . ఈ పురుగు ఉదృతి ఎక్కువగా వున్నప్పుడు గింజ దిగుబడులు విపరీతంగా తగ్గుతాయి
4. కంది కాయ తొలిచే ఈగ -మొలనాగ్రోమైజా అబ్ టుసా
ఈ పురుగు ఎక్కువగా ఆలస్యంగా విత్తిన పంట పై ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు గాయ పరిచేటప్పుడు దీని లక్షణాలు బయటకి కనిపించవు. ఇది ఆశించిన గింజలు నల్లగా మారి తినటానికి పనికిరావు. ఈ పురుగు గింజలలో పెరుగుతూ వుండడం వలన దీనిని గమనించడం చాలా కష్టం. కోషస్థ దశకు చేరుకునేముందుగానే ఈ పురుగు ఒక చిన్న రంధ్రాన్ని చేసుకుంటుంది దీని ద్వారా తల్లి పురుగు బయటకి వస్తుంది.
5. ఈకల రెక్కల పురుగు- ఎక్సలాస్టిస్ అబ్ టూసా
గొంగళి పురుగు మొదట కాయ గింజల పై పోరను గోకి తింటాయి. తర్వాత గింజ మొత్తము తింటాయి తద్వారా గింజ చర్మపు పొర మాత్రమే వదిలి వేయును. ఈ పురుగు పూత దశలో ఆశించి నట్లయితే పూత రాలి పోతుంది.
6.నీలి సీతాకోక చిలుక -కేటాక్రైసొప్స్ నిజస్
గొంగళి పురుగు పూత లోనికి మరియు కలోనికి ప్రవేశించి కాయలను తింటూ జీవిస్తాయి.
7. చిత్త పురుగులు - మదురేసియా అబ్స్కరెళ్ళ
పెద్ద పురుగుల పైరు విత్తగానే భూమి నుండి ఒక్కొక్క సారి మొక్క మొదలకు కత్తిరించి వేస్థాయి. దీని వలన పొలములో అక్కడ అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా దిగుబడులు తగ్గు తాయి.
గొంగళి పురుగు భూమిలో వుండే కుళ్ళిన పదార్థాలను లేక మొక్క వెర్లపై వుండే బుడిపెలను తింటూ జీవిస్తాయి. గొంగళి పురుగు తెల్లగ వుంటుంది. పంట విత్తేముందు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి
పంట విత్తిన తర్వత విత్తనము మొలకెత్తే దశలో కార్బరిల్ పౌడర్ లేక మాలతీయన్ పౌడర్ ను పంట సాళ్ళ పై చల్లాలి.
8.పూత పెంకు పురుగులు- మైలాబ్రిస్ పుస్టులెట్టా
ఈ పెంకు పురుగులను చేతితో గానీ లేక నెట్టు తోగాని పట్టి నాశనం చేయాలి. ఈ పురుగు నివారణ కొరకు సింతటిక్ పైరిత్రాఇడ్స్ పిచికారి చేయాలి.
9. పేను బంక-ఎఫిస్ క్రాక్సిఒరా
ఈ పురుగు ఎక్కువగా వున్నప్పుడు ఇది విసర్జించిన మలినం పై శిలీంద్రాలు పెరిగి నల్లని బూజు మాదిరి ఏర్పడుతుంది దేనినే సూటి మోల్డ్ అంటారు. దీని వలన మొక్కలో కిరణ జన్య సంయోగక్రియ సారిగా జరుగక పంట దిగుబడులు తగ్గును. సాధారణంగా బెట్ట పరిస్థితులలో ఈ పురుగు కి అనుకూలము ఖరీఫ్ లో ఎక్కువగా ఆశిస్తుంది.
10. ఇరియోఫీడ్ నల్లి - ఎసరియ కజని
ముఖ్యంగా ఈ పురుగులు స్టరిలిటి మొజాయిక్ వైరస్ ను వ్యాపింప చేయును. ఈ తెగులు అసించినపుడు మొక్క పైన పూత రాదు ఆకులు చిన్నవిగా వుండి లేత మరియు ముదురు ఆకపచ్చ రంగులో వుండి మొజాయిక్ లక్షణాలను చూపిస్తాయి. ఈ పురుగు నివారణకు ఐ. సి.పి.ఎల్ 87119,227, జాగృతి మొదలగు రకాలను విత్తు కావాలి. తెగులు సోకిన మొక్కలను పికి నాశనం చేయాలి . రసాయనిక పురుగు మందులు డైకొఫాల్5.0 మిళ్లి లీటర్లు లేక నీటిలో కరిగే గంధకము 3.0 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి
11. తెల్ల దోమ- బెమిసియ టబాసి
పిల్ల పురుగులు రసాన్ని పిలుస్తూ పళ్లకు తెగులును వ్యాపింపజేస్థాయి. ఎర్రని కళ్ళు తెల్లని రెక్కలు కలిగి వుంటాయి. మొదటి దశ పిల్ల పురుగులు కొంత సేపు మొక్కలపై తిరిగి తర్వత లేత భాగాలపై లేక ఆకులపై అతుక్కు పోయి రసాన్ని పీల్చుతూ నష్ట పరుస్తాయి.
12. దీపపు పురుగులు - ఎంపొయిస్క కెర్రీ
ఈ పురుగు అడుగు భాగమున చేరి వృద్ది చెందుతాయి పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకు అడుగు భాగమున చేరి రసాన్ని పిల్చుట వలన ఆకులు ముడుచుకుని పోయి. చివర్లు ఎండిపోయి దీనిని "హాపర్ బర్న్" అంటారు. సాధారణంగా ఈ పురుగులు పైరు బెట్టకు గురి అయినప్పుడు ఎక్కువగా ఆసిస్తయి.
13.కొమ్మనల్లి లేక కౌబగ్స్- అక్సిరాఖిస్ టరండాస్
పిల్ల మరియు పెద్ద పురుగుల లేత కొమ్మలు మరియు కాండము పై ఆశించి నష్ట పరుస్తాయి. ఈ పురుగు నివారణకు కొరకు మొనొక్రోటోపాస్ 1.6మిల్లో లీటర్లు లేక ఏసిపెట్ 1.5గ్రాములు1లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
0 కామెంట్‌లు