సిపాయిల తిరుగుబాటు ఆంధ్ర పై దాని ప్రభావం
![]() |
సిపాయిల తిరుగుబాటు అనేది 1857 వ సంవత్సరంలో జరిగింది. ఈ తిరుగుబాటు కి ముఖ్య కారణం ఆవు మరియు పంది కొవ్వు తో తయారుచేసిన తుపాకీ ముందు గుండ్లను సిపాయిలను వాడటం వలన ఈ తిరుగుబాటు మొదలైంది.
భరక్పూర్ రెసిడెంట్
మొట్టమొదటగా ఈ తూటాలను వ్యతిరేకించింది మంగళ పాండ్య, ఇతను 34వ రెసిడెంట్ అయినా భరక్పూర్ రెసిడెంట్ చెందిన వాడు.
మంగళ పాండ్య సిపాయిల తిరుగుబాటు లో భాగంగా బాగ్ మరియు హూక్సన్ అనే బ్రిటిష్ అధికారులను చంపాడు.
దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇతనిని శిక్షించేందుకు మిచెల్ అనే అధికారిని పంపింది, ఈ అధికారి జనవరి ఈశ్వరి పాండే అనే వ్యక్తిని సహాయం కోరాడు కానీ అతను మిచెల్ కు సహకరించకపోవడంతో మంగల్ పాండే ని పట్టుకున్న తర్వాత ఈశ్వరి పాండేను కూడా ఇద్దరిని కలిపి ఉరితీశారు.
మీరట్ రెసిడెంట్
అదేవిధంగా ఈ తిరుగుబాటు తొమ్మిదవ రెసిడెంట్ అయినా మీరట్ రెసిడెంట్ లో మొదలయింది. తిరుగుబాటులో ఆ ప్రాంతానికి చెందిన వారు 90 మంది పాల్గొన్నారు.
అయితే వీరందరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఎనభై ఆరు మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న మీరట్ మహిళలు మీరట్ యొక్క సిపాయిలను అవమానించారు, దీంతో మీరు సిపాయిలు బ్రిటిష్ వారిపై 1857-05-10 న తిరుగుబాటు ప్రారంభించి ఢిల్లీకి చేరుకున్నారు, అక్కడ మొగల్ చక్రవర్తి అయిన బహదూర్షా-2 నీ కలిసి తిరుగుబాటు కి నాయకునిగా ఉండాలని కోరారు, చక్రవర్తికి ఆ సమయంలో షాహిన్- సా- ఇ- హిందుస్థాన్ అనే బిరుదు ఇచ్చి అతనిని ఉద్యమానికి నాయకుని చేశారు.
బహదూర్ షా-2 యొక్క దూత అయినా అహసన్- ఉద్ధవ్లతాను భారతదేశంలో అన్ని సంస్థానాలకు పంపి అతనికి మద్దతు ఇవ్వాలని కోరారు, కానీ చాలామంది స౦స్థానికులు బహదూర్ షాకి మద్దతు ఇవ్వుటకు నిరాకరించారు. దీంతో బహదూర్షా నిరాశకు గురయ్యాడు.
సిపాయిల తిరుగుబాటు కాలంలో ఆంధ్రా లో జరిగిన ఉద్యమాలు
గంజాం ఏజెన్సీ
గంజాం ఏజెన్సీలోని పర్లాకిమిడి అనే ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అయితే ఈ గంజాం ఏజెన్సీ అనేది బ్రిటిష్ పాలనా కాలంలో ఒరిస్సాలోని జగపతి జిల్లాలో ఉండేది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సవర జాతి ప్రజలు నివసించేవారు. అయితే గైబ ప్రాంతానికి చెందిన రాధాకృష్ణ దండ సేనుడు అనే వ్యక్తి ఈ సవర జాతి ప్రజలు అందరినీ ఏకం చేసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. అయితే ఈ రాధాకృష్ణ దండ సేనుని బంధించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కెప్టెన్ విల్సన్ను పంపింది
గోదావరి ఏజెన్సీ
గోదావరి ఏజెన్సీ లో గల ఎర్రన్న గూడెం కొరుటూరు ప్రాంతంలో కూడా బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అయితే ఈ తిరుగుబాటును కోరుకొండ సుబ్బారెడ్డి అనే వ్యక్తి చేశాడు కానీ ఇతనికి శత్రువైనా శంకర స్వామి అనే మునుసూబు ఇతనిని బ్రిటిష్ వారికి పట్టించాడు. దాంతో ఈ ప్రాంతంలో ఉద్యమం విఫలం అయింది.
విశాఖపట్నం
విశాఖపట్నంలో కొంతమంది ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వీధుల వెంట అల్లరి చేశారు, అదేవిధంగా విశాఖపట్నానికి మహమ్మద్ పట్నం అనే పేరు పెట్టాలని కోరారు, కానీ ఈ తిరుగుబాటు కూడా విఫలం చెందింది.
ఆంధ్రాలో ఇతర చోట్ల జరిగిన తిరుగుబాటు
1) కడప ప్రాంతంలో షేక్ పీర్ సాహెబ్ అనే వ్యక్తి చేశాడు.
2) పోలవరంలో మంగపతి దేవుడు అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు.
3) మొగల్తూరులో చిన్న తిమ్మరాజు అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు.
4) నూజివీడు లో నరసింహ అప్పారావు అనే వ్యక్తి తిరుగుబాటు చేశాడు
5) అమరావతిలో వాసిరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులు తిరుగుబాటు చేశారు.
6) నరసరావుపేటలో మల్రాజు కుటుంబానికి చెందిన వారు తిరుగుబాటు చేశారు.
7) చిలకలూరిపేటలో మాణిక్యరావు కుటుంబానికి చెందినవారు తిరుగుబాటు చేశారు.
8) సత్తెనపల్లిలో మా నూరు కుటుంబానికి చెందిన వారు తిరుగుబాటు చేశాడు.
ఈ విధంగా 1857 వ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటును చేశారు కానీ ఈ తిరుగుబాటు మొత్తం జాతీయతా భావం తో చేయకపోవటం వలన, ఈ 1857 తిరుగుబాటు అనేది చాలావరకు విఫలం చెందడం జరిగింది. ఈ తిరుగుబాటులో చాలామంది ప్రజలు అదేవిధంగా చాలా మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. అయితే ఈ తిరుగుబాటు అనేది పెద్దగా విజయాన్ని సాధించలేదు ఎందుకనగా ఈ తిరుగుబాటు చేసిన వ్యక్తులు వారి వారి సమస్యల వలన బ్రిటిష్ వారిపై వ్యతిరేకత చూపారు అందరూ కలిసి జాతీయతా భావం తో తిరుగుబాటు చేయలేదు , ఇలా చేయడం వల్లనే ఈ తిరుగుబాటు అనేది పెద్దగా విజయాన్ని సాధించలేదు. ఈ తిరుగుబాటు తరువాత జరిగిన చాలా తిరుగుబాట్ల వలన కొద్దిగా విజయం అనేది సాధించారు.1857 తిరుగుబాటు అనేది వారి స్వ-అవసరాల కోసం చేసిన తిరుగుబాటుగా చాలామంది ఉద్యమకారులు పేర్కొన్నారు
0 కామెంట్‌లు