Andhra Pradesh student's Free Bus Pass scheme | విద్యార్థులు ఫ్రీ బస్సు పాస్ పథకం

నమస్తే శుభదినం
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరొక సంచలనాత్మక స్కీంను ప్రవేశపెట్టడం జరిగింది. 
ఎవరైతే విద్యార్థులు ఒకటవ తరగతి నుండి 10తరగతి వరకు చదువుతున్న గవర్నమెంట్ మరియు ప్రవేట్ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత "BUS PASS" అందజేయడం జరుగుతోంది.

 విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్రీ BUSS PASS పథకాన్ని జూన్ 12వ తేదీ విడుదల చేయడం జరిగింది. 13వ తేదీ నుండి అప్లై చేసుకునే దానికి అవకాశం కల్పించింది.

 విద్యార్థులు ఫ్రీ బస్సు పాస్ కొరకు కావలసిన డాక్యుమెంట్లు:-


 👉
స్టూడెంట్ ఆధార్ కార్డు

 👉 స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 

👉 విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ 

👉 స్కూల్ హెడ్మాస్టర్ సిగ్నేచర్ కలిగిన పత్రం

 👉 స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ 

👉 స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ 


 ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు మీ దగ్గరలోని ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి బస్సు పాస్ కు సంబంధించిన పత్రాలను వారికి సమర్పించండి. 

ఆ తరువాత మీ యొక్క బస్సు పాస్ ను అప్లై చేస్తారు. మీ బస్సు పాస్ అప్లై చేసిన తర్వాత రావటానికి కనీసం రెండు మూడు రోజుల సమయం పడుతుంది. 

 ఈ స్టూడెంట్ బస్సు పాస్ పథకం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు మీ స్కూల్ కు సంబంధించిన పత్రాలు మరియు హెడ్ మాస్టర్ యొక్క అనుమతి ఉంటే సరిపోతుంది.

 విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. 

                           జై హింద్ జై భారత్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు